ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు !

J. SURENDER KUMAR,

ధర్మపురి  ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్   మంత్రిగా ప్రమాణ స్వీకార చేసిన సందర్భంగా
ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం టపాసులు కాల్చి మిఠాయి పంచి సంబరాలు చేసుకున్నారు.


  ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మండల నాయకులు పట్టణంలోని స్థానిక నంది విగ్రహం వద్ద టపాసులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టి మంత్రి లక్ష్మణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.

పెగడపల్లి, ధర్మారం, గొల్లపల్లి, ఎండపెల్లి, బుగ్గారం మండలాలలో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి మిఠాయి పంపిణీ చేశారు.


నేరెళ్ళ గ్రామంలో..
నేరెళ్ళ, గోవిందుపల్లె గ్రామాల కాంగ్రెస్ శ్రేణులు  నేరెళ్ళ బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి టపాకాయలు కలిచారు స్వీట్ల పంపిణీ చేశారు,అనంతరం రెండు గ్రామాలలో బైక్ ర్యాలీ నిర్వహించారు.


మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను హైదరాబాద్ మినిస్టర్ బంగ్లాలో ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు జక్కు రవీందర్ మరియు కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి స్వామి వారి ప్రసాదం మరియు చిత్రపటాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.


మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ధర్మపురి శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మినిస్టర్ క్వార్టర్స్ లో కలసి ఆయన్ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి..


రాజ్ భవన్ లో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్   ప్రభుత్వ క్యాబినెట్ లో మంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్


హైదరాబాద్ లోని మినిస్టర్ క్వాటర్స్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అచ్చంపేట MLA వంశీకృష్ణ


హైదరాబాద్ లోని మినిస్టర్ క్వాటర్స్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను  మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు


మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన జగిత్యాల పట్టణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి – లక్ష్మణ్


మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన జగిత్యాల పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం..


మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను హైదరాబాదులో  మంత్రి నివాసంలో కలిసి అభినందనలు తెలిపిన జగిత్యాల జిల్లా ఆర్టిఏ సభ్యులు కమటాల శ్రీనివాస్..