దద్దరిల్లిన దండకారణ్యం మావోయిస్టు  అగ్రనేత సుధాకర్‌ హతం !

J.SURENDER KUMAR,

ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్ జిల్లాలో గురువారం తెల్లవారుజాము నుంచి దండకారణ్యం దద్దరిల్లింది  భద్రతా దళాలకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి, మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌ హతమయ్యాడు. సుధాకర్ పై కోటి రూపాయల రివార్డు ఉంది.

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంకి చెందిన సుధాకర్‌ అలియాస్‌ సింహాచలం, దాదాపు నాలుగు దశాబ్దాలుగా  మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పని చేస్తున్నారు. బీజాపూర్‌ జాతీయ పార్కు వద్ద మావోయిస్టు పార్టీ  అగ్ర నేతల  కదలిక లు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

గురువారం ఉదయం ఈ ఆపరేషన్‌ మొదలైంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , స్పెషల్ టాస్క్ ఫోర్స్  సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించింది. ఉమ్మడి దళాలు, నక్సల్స్ మధ్య ఈ తెల్లవారుజాము నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ నక్సల్, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌ను భద్రతా దళాలు కాల్చి చంపాయి.

మే నెలలో ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బసవరాజు అలియాస్‌ నంబల కేశవ్ రావు మృతి చెందారు. నక్సల్స్ బలమైన కోటగా పేరుగాంచిన దట్టమైన అబుజ్మద్ అడవులలో జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) నేతృత్వంలో జరిగిన ఉమ్మడి ఆపరేషన్‌లో మృతి చెందిన 30 మంది నక్సల్స్‌లో ఆయన ఒకరు. 

ఇది ఇలా ఉండగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం 16 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో ఆరుగురు పై ₹ 25 లక్షల రివార్డు అందుకున్నారని పోలీసులు తెలిపారు.