ద్విచక్ర వాహనంపై మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 మంత్రికి పూర్ణకుంభ స్వాగతం !

👉 మంత్రి గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించలేదు !


J.SURENDER KUMAR,

మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి  మంత్రి లక్ష్మణ్ కుమార్ ,ద్విచక్ర వాహనం నడుపుతూ ఆలయానికి చేరుకున్నారు.


మొట్టమొదటి సారిగా మంత్రి హోదాలో లక్ష్మణ్ కుమార్ మంగళవారం ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించారు.
మంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు నియోజకవర్గంలోని పత్తిపాక క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు స్వాగత ఏర్పాట్లు చేపట్టారు.

మంత్రి పర్యటన ఆలస్యం కావడంతో దాదాపు రాత్రి 7 గంటలకు మంత్రి కాన్వాయ్ ధర్మపురి కి చేరుకుంది. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు.


భారీ కాన్వాయ్ తో అంబేద్కర్ చౌక్, పుష్కర స్తూపం, నంది చౌక్ గుండా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోవడానికి ట్రాఫిక్ ఇబ్బందితో పాటు, పూలమాలలు, మంగళ హారతులతో ప్రజలు వేచి ఉన్నారు.  ఆలయా సాంప్రదాయబద్ధంగా పూజాది కార్యక్రమాలు, ఉత్సవాలు, ఆలయం తెరవడం, మూయడం, సమయపాలన పాటించాలని గతంలో అనేకసార్లు ఆలయ అధికారులకు మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు.


ఈ నేపథ్యంలో తన కాన్వాయ్ లో కాకుండా ద్విచక్ర వాహనం పై  ఆలయం మూసివేసే సమయానికి 20 నిమిషాల ముందుగా చేరుకొని మంత్రి లక్ష్మణ్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు.


👉 మంత్రికి పూర్ణకుంభ స్వాగతం !

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఆలయ అర్చకులు, వేద పండితులు, పాలకవర్గ అధ్యక్షులు ధర్మకర్తలు, పూర్ణకుంభంతో మేల తాళాలతో, స్వాగతం పలికారు. మంత్రి తో పాటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్వామివారి దర్శించుకున్నారు.


వీరికి ఆలయ వేద పండితులు, స్థానిక వేద పండితులు అర్చకులు ఆశీర్వచనం  ఇచ్చారు. స్వామి వారి ప్రసాదం, శేష వస్త్రం చిత్రపటాన్ని  కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు మంత్రికి అందించి సన్మానించారు.


👉 మంత్రి గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించలేదు !

మంత్రి హోదాలో మొట్ట మొదటిసారి ధర్మపురి కి చేరుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్  గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించలేదు.
పోలీస్ యంత్రాంగం సభ ప్రాంగణం లో  ( ఫంక్షన్ హాల్ ప్రాంగణం ) మంత్రి లక్ష్మణ్ కుమార్ కు గార్డ్ ఆఫ్ హానర్ ఏర్పాట్లు చేపట్టారు. అయితే   సూర్యాస్తమయం తరువాత గార్డ్ ఆఫ్ హానర్ కు నిబంధనలు అనుమతించవు. ఈ నేపథ్యంలో పర్యటన ఆలస్యం కావడం మంత్రి లక్ష్మణ్ కుమార్,  గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించలేదు .