దుబాయిలో గుండెపోటుతో ధర్మపురి యువకుడు మృతి !

J.SURENDER KUMAR,


ధర్మపురి పట్టణానికి చెందిన కటకం సిద్ధార్థ  (19)
దుబాయిలో మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు.
దాదాపు రెండు నెలల  క్రితం దుబాయ్ కి వెళ్ళిన  తాత్కాలి వేతనంపై ఏసి మెకానిక్ గా పనిచేస్తున్నట్టు సమాచారం.

నాలుగో అంతస్తులో పనిచేస్తూ సిద్ధార్థ ఓకే సారీ కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
మృతదేహం బుధవారం సాయంత్రం వరకు ఆస్పత్రిలోనే ఉంది.

సిద్ధార్థ మృతదేహం ఇండియాకు తీసుకురావడానికి అక్కడ పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు పోలీస్,  క్లియరెన్స్, అక్కడి ఇండియన్ రాయబార కార్యాలయా అధికారులను సంప్రదిస్తున్నారు.