👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనకు దివ్యాంగులు, వయోవృద్ధులు & ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో “మిషన్ పరివర్తన” అనే కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తెలిపారు.

అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం & అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్డు జలవిహార్ నుండి పీవీ నరసింహ రావు విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రోడ్డు రవాణా& బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం & అక్రమ రవాణాకు వ్యతిరేకంగా వారు ప్రతిజ్ఞ చేసి, పోస్టర్ ఆవిష్కరించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో, మాదకద్రవ్యాల దుర్వినియోగం, మాదక ద్రవ్యాల వాడకం ముఖ్యంగా యువతలో రోజురోజుకు విస్తృతంగా వ్యాపిస్తుందనీ, మాదక ద్రవ్యాలు శారీరక, మానసిక రుగ్మతలను కలిగించడమే గాక, నైతిక విలువలను దిగజారుస్తున్నయని, మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు
👉 సరదా కొరకు నేటి యువత మత్తుకు బానిస అవుతున్నారనీ, యుక్తవయసులోనే మాదకద్రవ్యాల వినియోగంతో దుష్ఫలితాల పై అవగాహన కల్పించడం మరియు ప్రతి పాఠశాల/కళాశాలలో, పని ప్రదేశాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు ఎంతో అవసరమని అన్నారు.
👉 మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం అనేక చట్టాలని రూపొందించిదని, మాదకద్రవ్యాల వినియోగ నివారణకు, కేంద్ర సామాజిక న్యాయం & National Action Plan for Drug Demand Reduction (NAPDDR) జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించిందనీ,
ఈ కార్యాచరణ ప్రణాళిక అమలుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నదనీ, మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉”మిషన్ పరివర్తన” కార్యక్రమం క్రింద తెలంగాణ రాష్ట్రములో నలుమూలల వివిధ అవగాహనా కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 66 కమ్యూనిటీ ఎడ్యుకేటర్స్ నియమించబడ్డారనీ, ఇప్పటివరకు 3954 పాఠశాలలు/కళాశాలలో మరియు 494 గ్రామాలలో 2956అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
👉 అవగాహన కార్యక్రమాల ద్వారా 2,07,232 మందికి మత్తు ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
👉 తెలంగాణలో అబ్జర్వేషన్ హోమ్ పిల్లల సంక్షేమం కోసం ప్రప్రథమంగా ప్రభుత్వ నిర్వహిత డీ-అడిక్షన్ సెంటర్ ప్రారంభం కావడం గర్వకారణమని, దీని ద్వారా మాదక ద్రవ్యాలకు బానిసైన పిల్లల కుటుంబాలకు అవగాహన పెంచడం, పిల్లల పునరావాసంలో కీలక పాత్ర పోషించడానికి మార్గదర్శకతను అందిస్తున్నారనీ, మంత్రి తెలిపారు.
👉 త్వరలోనే ఈ డీ-అడిక్షన్ సెంటర్ లను అన్ని అబ్జర్వేషన్ హోమ్ లలో ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరుగుతుందనీ, అన్నారు.

👉 4 కేంద్ర జైళ్లలో చెర్లపల్లి, నిజామాబాద్, హైదరాబాద్ ( చంచల్ గూడా ), మరియు సంగారెడ్డి లోని జైళ్లలో డీ-అడిక్షన్ సెంటర్లు త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నామనీ, మంత్రి తెలిపారు.
👉 మాదక ద్రవ్యాలకు బానిసలైన వారికి చికిత్స అందించడం కొరకు త్వరలోనే 23 జిల్లాల్లోని జిల్లా ఆసుపత్రులలో చికిత్సా కేంద్రాలు త్వరలో స్థాపించనున్న మన్నారు.
👉మాదకద్రవ్యాల పై సమాజంలో అవగాహన పెంచేందుకు మొట్ట మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రములోని 33 జిల్లాలో వారం రోజుల పాటు అనగా 20 జూన్ నుండి 26 జూన్ వరకు
వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.
👉 మాదక ద్రవ్య రహిత తెలంగాణను నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.

👉 అంతర్జాతీయ దినోత్సవం విజయవంతము చేయుటకు జిల్లా కలెక్టర్ లు పోలీసు శాఖ,ఎక్సెజ్ శాఖ, వైద్య & ఆరోగ్య శాఖ,విద్యాశాఖ, కమ్యూనిటీ ఎడ్యుకేటర్స్ డి-అడిక్షన్ సెంటర్ల సమన్వయముతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.
👉 యువత మాదకద్రవ్యాల పట్ల ఆకర్షితులుగా మారకుండా, తమ లక్ష్యాలను సాధించడంలో నిమగ్నమై, మాదక ద్రవ్య రహిత తెలంగాణను నిర్మించడంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.