J.SURENDER KUMAR,
👉 అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అనే నేను భారత రాజ్యాంగం……..

కొన్ని గంటలలో విస్తరణ జరగనున్న రాష్ట్రం మంత్రివర్గంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి వరించింది.
విద్యార్థి దశలో NSU నాయకుడిగా ధర్మారం జెడ్పీటీసీ గా రాజకీయ ప్రస్థానం మొదలైన లక్ష్మణ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగారు.
2009 నూతనంగా ఆవిర్భవించిన ధర్మపురి రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఉప ఎన్నికల్లో పోటీ చేశారు.
2014 స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ను ఓటమి అంచుల వరకు తీసుకువెళ్లి విజయం సాధించినా, నాటి అధికార ప్రభుత్వ ఒత్తిడికి అధికార యంత్రాంగం సాంకేతిక తదితర కారణాలు చూపెడితే లక్ష్మణ్ కుమార్ ఓడినట్టు ప్రకటించారు.

తమ ఓటమిని సవాల్ చేస్తూ లక్ష్మణ్ కుమార్ హైకోర్టు నాశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో EVM లు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి ఆదేశించే. నాటి ప్రభుత్వ యంత్రాంగం స్ట్రాంగ్ రూమ్ తాళం ” కీ” లేవు అనడంతో హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు.
ఎన్నికల నియమావళి నిబంధనల మేరకు అందులో ఉండాల్సిన డాక్యుమెంట్స్ లేకపోవడంతో. అప్పటి కలెక్టర్ ఈ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించింది. కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధి
ఈ సంఘటనపై విచారణ జరిపారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి సిట్టింగ్ ఎమ్మెల్యే, క్యాబినెట్ మంత్రి, కొప్పుల ఈశ్వర్ పై 22 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ కుమార్ విజయం సాధించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా కొనసాగుతున్నారు.

నేటి నుంచి లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా కొనసాగనున్నారు.