గద్దర్ ఫిలిం అవార్డు గ్రహీతలకు అభినందనలు సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక ‘తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు’ అందుకోబోతున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం  అభినందనలు తెలిపారు.

👉 తెలంగాణ కళారంగంలో వేగుచుక్కలాంటివారైన గద్దర్  పేరిట వివిధ విభాగాల్లో సినిమా కళాకారులకు అవార్డులు అందించటం గర్వకారణమని పేర్కొన్నారు. 2014 నుంచి 2024 వరకు – తెలంగాణ ఏర్పడిన పదేళ్ల కాలానికి గానూ ఉత్తమ సినిమాలకు అవార్డులు అందించటం, చలనచిత్ర వైతాళికుల పేరుతో ప్రత్యేక పురస్కారాలను ప్రకటించటం అభినందనీయమని అన్నారు. అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యుల కృషిని ముఖ్యమంత్రి  అభినందించారు.

👉 శనివారం (జూన్ 14 వ తేదీ) హైదరాబాద్ హైటెక్స్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది.