👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు 2027 లో, జరగనున్న గోదావరి నది పుష్కరాలను సైతం అంగరంగ వైభవంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు
క్యాబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన లక్ష్మణ్ కుమార్ మంగళవారం ధర్మపురి శ్రీలక్ష్మి స్వామి దర్శించుకున్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దయ, నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల వల్ల తనకు మంత్రి పదవి లభించిందన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 16 నెలల కాలంలోనే పదవి ద్వారా పేదల సంక్షేమానికి, కృషి చేశానన్నారు.
👉 గత ప్రభుత్వంలో మూతపడిన తెలుగు కళాశాలను ( నైట్ కాలేజ్ ) తిరిగి పున ప్రారంభించడం జరిగిందన్నారు.
👉 గత ప్రభుత్వంలో గోదావరి నది నీటిని గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల తరలించిన నాటి నాయకులు నోరు మెదపలేదన్నారు.
👉 రిజర్వాయర్ల నిర్మాణంతో వ్యవసాయ భూములు కోల్పోయిన ధర్మపురి నియోజకవర్గ రైతాంగానికి రెండు పంటల భూమికి ఎకరానికి ₹ 20 లక్షలు పలికే భూమికి ₹ 8 లక్షలు నిర్బంధంగా చెల్లించి రైతులను ఇబ్బందులకు గురి చేశారని మంత్రి అన్నారు.
👉 చొప్పదండి నియోజకవర్గంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి ₹ 22 లక్షలు చెల్లించి ఈ ప్రాంత రైతులకు ద్రోహం చేసిందన్నారు.
👉 దశాబ్దాల కాలం జీతాలు తెరజాక ఆలయ అర్చకులు, ఉద్యోగస్థుల జీతాలు ప్రత్యేక చొరవతో ప్రభుత్వంతో చర్చించి పెంచిన విషయం తెలిసిందే అన్నారు.
👉 తాగునీటి అవసరం ఉన్న ప్రతి చోట బోర్వేల్స్ వేయించడం,రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేయడం, చేపట్టినట్టు మంత్రి తెలిపారు.
👉 ఎల్లంపల్లి ముంపు గ్రామంలో బాధితులకు నష్టపరిహారం గత 10 సంవత్సరాల బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో చెల్లించలేదని మంత్రి అన్నారు.
👉 ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని నెలలలోనే ప్రభుత్వంతో చర్చించి ముంపు గ్రామాలు చెగ్యం, తాళ్ల కొత్తపేట, తదితరు బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు పరిస్థితి వివరించి ప్రభుత్వం ద్వారా వారి బ్యాంకు అకౌంట్లోకి ₹ 18 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు.
👉 పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలంలో ఐటీఐ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తామని, పాశిగామ వద్ద ఒక ట్రామా సెంటర్ ఏర్పాటుకు కూడా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.
👉 పవిత్ర గోదావరిలో సివరేజ్ నీరు కలవకుండా ఒక సివరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు పరిపాలన అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ని కలిసి విజ్ఞప్తి చేయగా సీఎం సానుకూలంగా స్పందించారు అని అన్నారు
👉 ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుండి ఈ రోజు ఒక మంత్రి స్థాయిలో మీ ముందు ఉన్నానంటే అది మా కార్యకర్తలు పడిన కష్టం వల్లనే అని,పార్టీకోసం,నా గెలుపుకోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, ధర్మపురి నియోజకవర్గాన్ని అభివృద్ధి మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు