గ్రామీణ విద్యార్థుల విజ్ఞానాన్ని కి మెరుగులు పెడుతున్నారు !

👉 రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీమతి కాంతా కుమారి !

J.SURENDER KUMAR,

మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అత్యుత్తమ విజ్ఞానాన్ని అందించేందుకు ఇటువంటి క్యాంపులు నిర్వహించడం చాలా గొప్ప విషయమని, అందుకు కారకులైన సంస్థ స్థాపకులు అయిన డా. కరుణాకర్ రెడ్డి  సేవలు అమోఘమని ప్రశంసించారు. స్వశోధన్ ట్రస్ట్ సమ్మర్ క్యాంప్ నిర్వహణ అభినందనీయం అని ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ ప్రొఫెసర్ కాంత కుమారి అన్నారు.

స్వశోధన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా  ధర్మపురి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ శుక్రవారం ముగిసింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొలిచాల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా విద్యావేత్త శ్రీమతి కాంత కుమారి, పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెండ్యాల మహేందర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గుండి రామ్ కుమార్, సామాజిక సేవకులు డా. గొల్లపెల్లి గణేశ్, యోగ గురువు పెద్ది శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని సంస్థ బాధ్యులు వేదాంతం భార్గవ నిర్వహించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఆత్మన్యూనతకు గురి కాకుండా, వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు, అత్యుత్తమ విజ్ఞానాన్ని వారికి అందించేందుకు ఇటువంటి శిబిరాలను నిర్వహించడాన్ని ప్రతి ఒక్కరు అభినందించారు.

ఈ శిబిరంలో విద్యార్థులకు నెల రోజుల పాటు యోగ, కంప్యూటర్, సంగీతం, చిత్ర లేఖనం, భగవద్గీత, ఆరోగ్యం, ఆర్థికశాస్త్రము మొదలగు అంశాలపై దేశ విదేశాలలోని నిపుణులు టీవి మాధ్యమం ద్వారా శిక్షణ ఇచ్చారు.

దీనిలో భాగంగా నెల రోజుల పాటు విద్యార్థులు నేర్చుకున్న అంశాలు ప్రదర్శించడం ఆకట్టుకుంది.
కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ లు వేదాంతం భార్గవ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.