J.SURENDER KUMAR,
మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి శ్రీ శారద చంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 19వ వార్షికోత్సవ సందర్భంగా జూలై 2 నుండి 6 వరకు శ్రీ గణపతి, మహాలక్ష్మి ,సుదర్శన ,అరుణ ,రుద్ర సహిత శత చండీ యాగం హైదరాబాద్ విఎన్ఆర్ గార్డెన్స్ (మల్లాపూర్) లో నిర్వహిస్తున్నట్టు కన్వీనర్ సిరిసిల్ల రాంప్రసాద్ శర్మ తెలిపారు.
గురువారం సాయంత్రం జగిత్యాలలో ప్రముఖవాస్తు జ్యోతిష పండితులు , నంబి వేణుగోపాల ఆచార్య కరపత్రం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నంబి వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ..
లోక కళ్యాణార్థం మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న వైదిక క్రతువులు దేశంలో జరుగుతున్న ఉపద్రవాలను నిర్మూలించడానికి అభిషేకము, అనుష్టానములు, కుంకుమార్చనలు, ఎంతగానో దోహదపడతాయని అన్నారు.
గణపతి పూజ దీక్షదారణము ఋత్విగ్వర్ణం, స్వస్తి పుణ్యా వాచనము దేవత కలశ స్థాపన తో ప్రారంభం కానున్నదన్నారు.

జూలై 6న మహా పూర్ణాహుతి కలశోద్వాసనము శాంతి కల్యాణము రుత్విక్ సన్మానము మహా దాశీర్వచనముతో కార్యక్రమం ముగియనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్, హరిహరాలయ చైర్మన్ చాకుంట వేణుమాధవ్ రావు, రాజేంద్ర శర్మ ,సామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.