ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రతి సోమవారం డబ్బులు వేస్తాం !

👉 పేదల నిర్మాణానికి రుణాలు ఇస్తాం !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

ఇందిరమ్మ ఇండ్లు పొందడానికి ఎంపికైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పనుల ప్రగతితో ప్రతి సోమవారం వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తాం, ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కు డబ్బులు లేని నిరుపేదలకు రుణాలు ఇస్తాం అని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు .

ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో ప్రాంగణంలో శనివారం ధర్మపురి మండలం  మరియు మున్సిపల్ పరిధి కి చెందిన సుమారు 699 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రొసీడింగ్ పత్రాలను లబ్ధిదారులకు  మంత్రి లక్ష్మణ్ కుమార్  కలెక్టర్ సత్యప్రసాద్ పంపిణీ చేశారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ...

నిబంధనల మేరకు ఇంటి నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు పనుల పురోగతి మేరకు ప్రతి సోమవారం వారి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందన్నారు. ఇంటి నిర్మాణం డబ్బులు లేని నిరుపేదలకు మహిళా సంఘాల ద్వారా రుణాల అందిస్తామని మంత్రి అన్నారు.

తాను మంత్రి గా బాధ్యతలు చేపట్టి, ప్రభుత్వం అమలు చేస్తున్న  పేదల సంక్షేమ కార్యక్రమాలలో మొట్ట మొదట పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.


భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని, మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందని, ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగ నిర్దేశించిన  స్క్వేర్ ఫీట్స్ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలని దానికి అనుగుణంగా అధికారులు విచారణ జరిపి నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని అంతే అన్నారు.
ఎవరైనా అర్హత ఉండి ఇల్లు రాని వారు ఉంటే నన్ను నేరుగా  సంప్రదించాలన్నారు.


అనంతరం  మండలంలోని ధమ్మన్నపేట గ్రామానికి చెందిన జక్కు రమేష్ మరియు మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నరసింహ కాలనిలో శ్యాంరావు కుమార్ కు మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ భూమి పూజలు చేశారు.