ఇంటర్వెన్షనల్ కౌన్సిల్ లో గుండె చికిత్స ప్రత్యక్ష ప్రసారం !

👉 డాక్టర్ శ్రీధర్ కస్తూరి నాయకత్వంలో…

J.SURENDER KUMAR,

ముంబైలో ఆదివారం జరిగిన ‘నేషనల్ ఇంటర్వెన్షనల్ కౌన్సిల్, కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ జాతీయ సదస్సులో భాగంగా, ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరి ప్రత్యక్ష గుండె చికిత్స కేసును ప్రదర్శించారు.

హైదరాబాదులోని కిమ్స్ సన్ షైన్  హార్ట్ సెంటర్ నుండి జియో సెంటర్‌కు జరిగిన లైవ్ కేస్ ట్రాన్స్‌మిషన్ అత్యంత విజయవంతమైంది. ఈ సందర్భంగా,  జియో సెంటర్‌లోని ప్రధాన హాలులో దాదాపు 45 నిమిషాల పాటు ప్రదర్శించబడింది.

ఈ కేసును ఇంత అద్భుతంగాను, ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనవిజయం చేసిన డాక్టర్ శ్రీధర్ కస్తూరి కార్డియాలజీ, సహోద్యోగుల బృందానికి ఆస్పత్రి యాజమాన్యం, ప్రముఖ వైద్యులు అభినందించారు.