ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు ఆర్థిక సహాయం చెయ్యండి !

👉 కేంద్ర  మంత్రి రామ్‌దాస్ అథవాలే కు మంత్రి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి !

J.SURENDER KUMAR,

  తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌ల స్థాపనకు ఆర్థిక సహాయం అందించాలని,తెలంగాణకు PCR/POA చట్టాలు మరియు PM- AJAY పథకం కింద కేంద్ర సహాయం విడుదల చేయాలని కోరుతూ


కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే ను  ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హైదరాబాద్ లోని టూరిజం ప్లాజ హోటల్ లో శుక్రవారం  మర్యాద పూర్వకంగా కలసి
వినతి విజ్ఞప్తి చేశారు.

👉 ఈ సందర్భంగా  మంత్రి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ….

తెలంగాణ ప్రభుత్వానికి విద్య ఒక ముఖ్యమైన ప్రాధాన్యతనీ వివిధ సంక్షేమ సంఘాల క్రింద 1,023 నివాస విద్యా సంస్థలను నిర్వహిస్తున్నామని, వీటిలో దాదాపు 650 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని మంత్రి అన్నారు.

👉 మౌలిక సదుపాయాలు మరియు సేవ నాణ్యతలో పరిమితులు సృష్టిస్తుందని, ఈ సంస్థలను కొత్తగా ప్రతిపాదించబడిన నివాస పాఠశాల సముదాయాలుగా మార్చడానికి ఉద్దేశించడం జరిగిందని, దిన్ని పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (YIIRS) చొరవను ప్రారంభించిందనీ, మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు.


👉 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రతి ఒక్కటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టనీ, ఈ పాఠశాలలు ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల విద్యను అందించడానికి రూపొందించబడ్డాయని, మంత్రి వివరించారు.

👉 ఒక్కొక్కటి ₹200.00 కోట్ల అంచనా వ్యయంతో 55 YIIRS ప్రాజెక్టులు మంజూరు కావడం జరిగిందని, ఈ సంస్థలు SC, ST మరియు మైనారిటీ విద్యార్థులకు సమగ్ర అభివృద్ధి,విద్యా, నైతిక, శారీరక మరియు సాంకేతిక అంశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని,దీనికి కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయాన్ని అందించాలని, మంత్రి కోరారు.

👉 తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి రెండు కీలక రంగాల కింద భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ నుండి పెండింగ్‌లో ఉన్న బడ్జెట్ విడుదల చేయాలని కేంద్ర మంత్రి ని కోరగా జరిగిందని. కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే తమ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.