జగిత్యాల జిల్లాలో రైతు భరోసా ₹ 251 కోట్లు రైతుల ఖాతాలోకి!

👉 2 లక్షల48 వేల 550 మంది రైతుల ఖాతాలోకి !

👉 ఎకరానికి ₹ 6 వెల చొప్పున 4.18 లక్షల ఎకరాలకు ₹ 251.14 కోట్ల నిధులు ఖాతాలోకి!

J.SURENDER KUMAR

జగిత్యాల జిల్లాలో రైతుభరోసా పథకం పెట్టుబడి సాయం నిధుల సోమవారం సైతం రైతుల ఖాతాలో జమ అయ్యాయి.ఇప్పటి వరకు 221994 మంది రైతులకు ₹ 237.71 కోట్ల నిధులు వచ్చాయని జిల్లా వయసాయ అధికారి వి. భాస్కర్ తెలిపారు.


జిల్లాలోని మొత్తం 2,48,550 మంది రైతులు, 4.18 లక్షల ఎకరాలకు చెంది ఎకరాకు ₹ 6 వెల చొప్పున ₹ 251.14 కోట్ల నిధులు రావలసి ఉందన్నారు.
మిగిలిన రైతులకు నిధుల విడుదల కొనసాగుతుందని వివరించారు.

👉 రేపు రైతులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ !

జగిత్యాల జిల్లాలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం 4-30 నిమిషాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా లో 52 రైతు  వేదిక లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో నేరుగా మాట్లాడనున్నారు.

రైతు వేదికల వద్దకు నిర్ణీత సమయంలో రైతులు పాల్గొనవలసిందిగా  జిల్లా వయసాయ అధికారి వి. భాస్కర్ ప్రకటనలో కోరారు.