జగిత్యాలలో మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం !

👉 రాజీవ్ గాంధీ విగ్రహం నుండి బైక్ ర్యాలీ !


J.SURENDER KUMAR,

రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటి సారిగా జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు


ఈ సందర్భంగా జిల్లా కేంద్రం నుండి టౌన్ హాల్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ,కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు  మరియు నాయకులతో కలిసి పాల్గొన్నారు,


అనంతరం రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి టౌన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

👉 ఎమ్మెల్యే సంజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో..

జగిత్యాల జిల్లా కేంద్రానికి  విచ్చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు  మొక్కను అందజేసి, డాక్టర్ సంజయ్ కుమార్ , గజమాల తో ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జీ జువ్వాడి నర్సింగ రావు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.