జలాల వినియోగం పై అసెంబ్లీ వేదికగా చర్చ కు సిద్ధంగా ఉండాలి !

👉18 నెలల కాలంలో రైతుల సంక్షేమానికి లక్షా 4 వేల కోట్ల కోట్ల రూపాయల వ్యయం !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

గోదావరి, కృష్ణ నది జలాల వినియోగం పై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్దంగా ఉండాలని  సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మంగళవారం రైతులతో సీఎం రేవంత్ ముఖాముఖి కార్యక్రమానికి పెగడపల్లి రైతు వేదిక నుంచి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ హాజరయ్యారు.

సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రైతు విజయోత్సవ సభ కార్యక్రమంలో   సీఎం రేవంత్ రెడ్డి ,  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క,శాసన మండలి చైర్ పర్సన్ గుత్త సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు, ఇతర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు,  సీఎస్ కె. రామ కృష్ణా రావు లతో కలిసి పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,

1

70 లక్షల పైగా రైతులకు కోటి 49 లక్షల పైగా ఎకరాలకు ప్రభుత్వం 9 రోజుల వ్యవధిలో 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు జమ చేసిన నేపథ్యంలో ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.   జడ్పిటీసీ స్థాయి నుంచి నేడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తనకు ప్రతి ప్రజలు అండగా నిలిచిన తెలంగాణ రైతాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

👉 భూమికోసం భుక్తి కోసం రైతాంగ పోరాటాలు జరిగాయని, ఆదిలాబాద్ లో గోండు బిడ్డ లు కొమురం భీమ్ జల్ ,జంగల్,  జమీన్ నినాదాలతో పశువులు బాసారని అన్నారు. భూమి చుట్టూ మన జీవితం ముడిపడి ఉందని అన్నారు.   వ్యవసాయం దండగ పరిస్థితి నుంచి వ్యవసాయం పండుగ చేయాలని సోనియాగాంధీ ఆశీర్వాదంతో గతంలో  డాక్టర్ వైయస్సార్ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్తు అందించడంతో పాటు పెండింగ్ విద్యుత్ బకాయిలను రద్దు చేసిందని  అన్నారు.

👉 సోనియాగాంధీ ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏర్పాటు చేసిన నేటి ప్రజా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత రైతాంగం మాత్రమేనని అన్నారు. రైతులు, మహిళలు, తెలంగాణ ఉద్యమ కారులు, విద్యార్థులే తమ ప్రాధాన్యత అని అన్నారు.

👉 గత  పెండింగ్ పెట్టిన 7 వేల 625 కోట్ల రైతు భరోసా బకాయిలను ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల కాలంలోనే చెల్లించామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 25 లక్షల 35 వేల పైగా రైతులకు 20 వేల 617 కోట్ల రూపాయలు ఖాతాలలో జమ చేసి రెండు లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు రైతులను రుణాలు  నుంచి విముక్తి చేశామని అన్నారు. కొనుగోలు ప్రభుత్వ పరిధిలోని అంశం కాదని గత పాలకులు బాధ్యతలు నుంచి తప్పుకుంటే, ప్రజా ప్రభుత్వం రైతుల పండించిన చివరి గింజ వరకు మద్దతు ధర పై కొనుగోలు చేయడమే కాకుండా సన్న వడ్లకు  క్వింటాల్ 500 రూపాయల బోనస్ చెల్లించిందని అన్నారు.

👉 ప్రజా ప్రభుత్వం అందించిన భరోసా మేరకు తెలంగాణ రైతాంగం  వరి పండించడంలో పంజాబ్ హర్యానా రాష్ట్రాలను దాటిందని, 2 కోట్ల 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించిందని,  గతంలో తాళ్ల పేరుతో రైతులకు  10 కిలోల వరకు కటింగ్ చేసేవారని, నేడు ఆ దోపిడి తమ ప్రభుత్వం పూర్తిగా నిలువరించిందని, రైతులకు మద్దతు ధర 48 గంటల్లో జమ చేస్తున్నామని అన్నారు.

👉 ధనిక రాష్ట్రాన్ని గత పాలకులు 8 లక్షల 19 వేల కోట్ల అప్పుల పాలు చేశారని అన్నారు.  రైతుల పేరుతో గత పాలకులు వేల కోట్ల రూపాయల అక్రమంగా సంపాదించారని, వారి హయాంలో రాష్ట్రం దివాళా చేసిందని సీఎం విమర్శించారు.  గతంలో వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసి వేసారని, విద్యార్థులకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వాయిదా వేయాలని నిరుద్యోగ యువత ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని , మొదటి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు.

👉 18 నెలల కాలంలో రైతుల సంక్షేమానికి లక్షా 4 వేల కోట్ల కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం ఖర్చు చేసిందని, దీనిపై చర్చకు ప్రతిపక్షాలు సిద్ధం కావాలని సీఎం సవాల్ విసిరారు. గత పాలకులు ప్రాజెక్టుల పేరుతో లక్ష కోట్ల రూపాయలను దోపిడి చేస్తే తాము ఆ డబ్బును పది మందికి ఉపయోగపడేలా  వ్యవసాయం  చేసే రైతుల కోసం ఖర్చు చేశామని అన్నారు.

👉 మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇందిరా మహిళ శక్తి కార్యక్రమం క్రింద  క్యాంటీన్, పెట్రోల్ బంక్, రైస్ మిల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, ఆర్టీసీ సంస్థలో అద్దె బస్సులు వంటి అనేక వినూత్న వ్యాపారాలను మహిళలతో ప్రారంభిస్తున్నామని అన్నారు. అంబానీ ఆదానీలకు పోటీగా మహిళా సంఘాల చే వెయ్యి మెగావాట్ల  సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు తయారు చేసామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

👉 మహిళలకు మొదటి సంవత్సరం 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని, హైదరాబాదులో శిల్పారామం దగ్గర నాలుగు ఎకరాల స్థలం కేటాయించి మహిళా స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులు అమ్మకానికి షాపులు ఏర్పాటు చేశామని, ప్రభుత్వ పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల చేతిలో పెట్టామని, ఏక రూప దుస్తులను మహిళా సంఘాలతో కుట్టిస్తున్నామని, పాఠశాలలకు అవసరమైన పనులు కూరగాయలు ఇతర సామాగ్రి సరఫరా బాధితులను కూడా మహిళలకు అప్పగించినట్లు సీఎం తెలిపారు.

👉 గత పది సంవత్సరాల కాలంలో కృష్ణా, గోదావరి నదుల పై ఎటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని సీఎం  విమర్శించారు. సీతారామ ఎత్తిపోతల పథకం, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, బీమా, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని అన్నారు.

👉 గోదావరి, కృష్ణా నది జలాల పై చర్చకు  ప్రతిపక్ష నాయకులు ముందుకు రావాలని, అసెంబ్లీలో చర్చకు స్పీకర్ కు లేఖ రాస్తే వెంటనే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అసెంబ్లీ ను సమావేశ పరుస్తారని అన్నారు.  2016 లో  గోదావరి నది బనకచర్ల ప్రాజెక్టు అంకురార్పణ పడితే నేడు తమను విమర్శించడం పద్దతి కాదని అన్నారు.

👉 రైతు ను రాజు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తామని అన్నారు.

👉 డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ

,   9 రోజులలో 9 వేల కోట్ల రూపాయలను 70 లక్షల రైతుల ఖాతాలో జమ చేయడం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన గొప్ప కార్యక్రమాన్ని అన్నారు.   వ్యవసాయానికి ఉచిత కరెంట్, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించాలని మద్దతు ధర , బ్యాంకుల ద్వారా ప్రయార్టీ సెక్టార్ క్రింద రైతులకు రుణాలు పంపిణీ చేయడం, హరిత విప్లవం వంటి అనేక కార్యక్రమాలను స్వాతంత్రం వచ్చిన తర్వాత తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టామని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు.

👉 రైతు పక్షపాతిగా  తమ ప్రభుత్వం పని చేస్తుందని, ఇందిరమ్మ ప్రభుత్వం 21 వేల కోట్ల రుణ మాఫీ చేసిందని, రైతు కూలీలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ  భరోసా క్రింద 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు.  

👉 గత పాలకులు రైతులకు అందించే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, మద్దతు ధర,  బోనస్,  వడ్డీ లేని రుణాలు, పంట నష్టపరిహారం  వంటి అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసి కేవలం అరకోర రైతు బంధు కార్యక్రమం నిర్వహించిందని, తమ ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేస్తూనే మిగిలిన సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టిందని అన్నారు.

👉 వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, 

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్నామని అన్నారు.   మన పథకాలను ఇతర రాష్ట్రాల పాలకులు పరిశీలిస్తున్నారని మంత్రి తెలిపారు.  రైతాంగం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని రాజీవ్ గాంధీ సూచనల మేరకు ఉత్తమ పాలన సాగుతుందని అన్నారు.

👉 రైతు భరోసా నిధులు జమ అయ్యాయని తెలంగాణ రైతాంగం చేసుకుంటున్న సంబరాలలో తాము భాగస్వామ్యం అవుతున్నామని అన్నారు.  25 లక్షల మంది రైతులకు తెలంగాణ రాష్ట్రంలో 21 వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి 2 లక్షల వరకు పంట రుణ మాఫీ పూర్తి చేశామని మంత్రి గుర్తు చేశారు.  తెలంగాణ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి డిమాండ్ చేశారు.

👉 గతంలో మన్మోహన్ సింగ్ హయాంలో రుణమాఫీ జరిగిందని, అనంతరం సీఎం రేవంత్ హయాంలో రుణమాఫీ జరిగిందని అన్నారు.  పంట కాలానికి పెట్టుబడి సహాయం అందించాలనే లక్ష్యంతో 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేశామని, దీనికి సహకరించిన ఆర్థిక శాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్,  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.