👉 రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లలో..
J.SURENDER KUMAR,
తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూలై 05 వ తేదీ నుండి జూలై 13 వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నట్లు IRCTC టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ DSGP కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు.
👉 యాత్ర కు సంబందించిన వివరాలు :
ప్యాకేజీ వివరాలు
ఐదు జ్యోతిర్లింగ యాత్ర : ఉజ్జయిని (మహాకాళేశ్వర్ – ఓంకారేశ్వర్) త్రయంబకేశ్వర్ – భీమశంకర్ – ఘృష్ణేశ్వర్). ఈ యాత్రలో మహాకాళేశ్వర్ ఓంకారేశ్వర్ , త్రయంబకేశ్వర్ , భీంశంకర్ , ఘృష్ణేశ్వర్ ఎల్లోరా మోవ్ నాగ్పూర్ ప్రాంతాలు సందర్శించవచ్చు.
యాత్ర జూలై 05 వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు ఉంట్టుంది.
ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర ₹ 14700, 3 A -C ₹ 22900, 2nd A -C ₹ 29900 ఉంటుంది.
ఈ యాత్ర సికింద్రాబాద్ ,కామారెడ్డి ,నిజామాబాద్ ధర్మాబాద్ ,నాందేడ్ ,ముధ్ఖడ్ ,మరియు పూర్ణ మీదుగా వెళ్తుంది.
👉సౌకర్యాలు:
రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం), వాటర్ బాటిల్ మరియు టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు, (అదనపు ఖర్చు లేదు), ప్రయాణ బీమా, ఇన్సూరెన్స్ అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగ ఉచితం. ప్రతి రైలు లో 718 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినెటర్లు అందుబాటులో ఉండి అన్ని సావకార్యాలు సమకురుస్తారు.
కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు.
👉 టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు
9701360701, 9281495843, 9281030750, 9281030749 లకు సంప్రదించాలని
మరిన్ని వివరణలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రధించాలని తేలిపారు.