జర్నలిస్టుల సంక్షేమానికి మా ప్రభుత్వం  కట్టుబడి ఉంది !

👉 ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్  !

J.SURENDER KUMAR,

జర్నలిస్టుల సంక్షేమానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని,  రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన జర్నలిస్టు, బాబు కుమార్ కు తెలంగాణ మీడియా అకాడమీ పక్షాన లక్ష రూపాయలు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్  లక్ష్మణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జర్నలిస్ట్ నాయకుడి అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఇచ్చిన లక్ష రూపాయల చెక్కును నవతెలంగాణ జర్నలిస్టు  బాబు కుమార్ కు అందించారు.

👉 ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు తప్పక మా ప్రభుత్వం ఇస్తుందని, అయితే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియ నెల రోజుల్లో పూర్తవుతుందని అన్నారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం  కలెక్టర్ , ఆర్డీవో రెవెన్యూ అధికారుల సమక్షంలో స్థలాలు గుర్తించి పంపిణీ చేస్తామన్నారు.

👉 గతంలో  కేసీఆర్ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో యజ్ఞాలు, హోమాలు చేసి ఆలయ అభివృద్ధికి ₹ 500 కోట్ల రూపాయలు ఇస్తాం అని చెప్పి ₹ 5 రూపాయలు కూడా ఇవ్వలేదని, ఎమ్మెల్యే ఆరోపించారు.

👉 ధర్మపురి నియోజకవర్గాన్ని ఏ రంగంలో అభివృద్ధి చేశారో బి.ఆర్.ఎస్ నాయకులు చెప్పాలని, మీ ప్రభుత్వ హయంలో రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క గురుకుల, కస్తూరిబా పాఠశాలలను , హాస్టల్స్ గూర్చి గత ప్రభుత్వ నాయకులు ఎప్పుడైనా పట్టించుకున్నారా  ? అనే ప్రశ్నించారు.

👉 మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులకు డైట్ చార్జీలను, కాస్మొటిక్ చార్జీలను పెంచడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందనీ, అదే విధంగా ధర్మపురి కి సుమారు వంద కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల  మంజూరు చేయడం జరిగిందన్నారు.

👉 ఇటీవలే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో 2024-25 విద్య సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ కనబర్చిన దళిత వర్గానికి చెందిన దాదాపు నాలుగు వందల మంది విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం, స్పీకర్ అవార్డులతో పాటు నగదు బహుమతి దళిత విద్యార్థులకు  పంపిణీ చేశారన్నారు.

👉 గత ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్,   సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రిగా వ్యవహరించారో ఆ శాఖలో చాలా అవకతవకలు జరిగాయని, వాటిని త్వరలో ప్రజల ముందు పెడతామన్నారు.

👉 ఇందిరమ్మ ఇల్లు పొందడానికి అర్హులైన జర్నలిస్టులు ఉంటే వారికి ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.