కాలేశ్వరం పేరిట గత ప్రభుత్వం సొమ్ము దోపిడీ చేసింది !

👉 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క !

J SURENDER KUMAR,

భూపాలపల్లి జిల్లాలో ₹ 8.70 కోట్ల విలువైన సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన, ప్రారంభించిన అనంతరం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ
కాలేశ్వరం పేరిట గత ప్రభుత్వం రాష్ట్ర సొమ్ము దోపిడీ చేసినట్లు అన్నారు.

👉 అత్యంత ప్రమాదకరం, డిజైన్ కు కట్టిన దానికి పొంతనలేదని ఎన్డిఎస్ఏ  చెప్పినట్లు తెలిపారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులకు చిన్న పగులు కూడా రాలేదన్నారు.

👉 రాష్ట్రంలో ఇల్లు లేని, ఆదాయం లేని కుటుంబాలు ఉండొద్దని.. ఆకలితో ఏ ఒక్కరు బాధపడొద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య మని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని వెనుకబడనివ్వం, అభివృద్ధిని ఆగనివ్వమని స్పష్టం చేశారు.

👉 గతంతో పోలిస్తే ఈ సంవత్సరం 2 వేల మెగావాట్ల విద్యుత్ అదనపు డిమాండ్ వచ్చినా రాష్ట్రంలో ఒక్క నిమిషం అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసిన చరిత్ర రాష్ట్ర ప్రభుత్వానిదని తెలిపారు.  ఉచిత విద్యుత్ పథకాల కోసం రాష్ట్ర ప్రజల పక్షాన ప్రభుత్వం ప్రతి సంవత్సరం 13,992 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు.


👉 కాలేశ్వరం పేరిట లక్ష కోట్లు ఖర్చుపెట్టి రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము దోపిడీ చేసిన బిఆర్ఎస్ నాయకులు సిగ్గు లేకుండా కాలేశ్వరం బ్రహ్మాండమని చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారని అన్నారు. కాలేశ్వరం కుంగిపోతున్న విషయాన్ని ఫోటోలతో బయటపెట్టింది జర్నలిస్టులు, కాలేశ్వరం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందని ఎన్ డి ఎస్ ఏ నివేదిక ఇచ్చిందని, చూపెట్టిన డిజైన్ కు కట్టిన దానికి పొంతన లేదని స్పష్టం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ఎస్ .ఆర్ .ఎస్. పి. అంగుళమైనా కదిలిందా, శ్రీపాద ఎల్లంపల్లి కి ఏమైనా ఇబ్బంది వచ్చిందా? నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నాయి అని డిప్యూటీ సీఎం వివరించారు.


👉 ఇంజనీర్ల పని వారిని చేయకుండా బి ఆర్ ఎస్ నేతలు డిజైన్ చేయడం, పనుల్లో పూర్తిగా జోక్యం చేసుకోవడంతో పెద్ద ఇబ్బంది వచ్చి పడిందని డిప్యూటీ సీఎం అన్నారు.


👉 కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు అని ఎన్నికల ముందు టిఆర్ఎస్ నేతలు ప్రచారం చేశారు,  2025 మార్చిలో 17,162  మెగావాట్ల పీక్ డిమాండ్ ఏర్పడింది.. టిఆర్ఎస్ నేతల పాలన కాలం 2023 మార్చి తో పోలిస్తే ఈ సంవత్సరం 2 వేల మెగావాట్లు డిమాండ్ అధికంగా వచ్చింది అయినా ఒక్క నిమిషం కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా రాష్ట్ర ప్రజలకు సేవ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి అని డిప్యూటీ సీఎం అన్నారు.


👉 ఈ విజయం సాధించిన లైన్మెన్ నుంచి సిఎండి వరకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు తెలియజేస్తున్నట్టు తెలిపారు.
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు పథకానికి ఇప్పటివరకు 16 వేల కోట్లు ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది, రాష్ట్రంలో 50 వేల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం మొత్తంగా ఉచిత విద్యుత్ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రతి సంవత్సరం 13,992 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుందని వివరించారు.


👉 ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ
ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని వెనుకబడనివ్వం అభివృద్ధిని ఆగనివ్వం అని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇల్లు లేకుండా, ఆదాయం లేకుండా ఇబ్బంది పడొద్దు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆకలితో ఏ ఒక్కరూ ఎంత మాత్రం ఇబ్బంది పడొద్దు అనేదే ప్రజా ప్రభుత్వం ఆలోచన అన్నారు.


👉 గత పది సంవత్సరాలు పరిపాలించిన వారు ప్రతి రూపాయిని దోచుకున్నారు, కోరి కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, జీవన ప్రమాణాలు పెరగలేదు అందుకే రాష్ట్ర ప్రజలు 2023లో పరిస్థితిని అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.


👉 ప్రజల పక్షాన కాదు పాలకుల పక్షాన నిలబడాలని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని,  కానీ మేము ప్రతిరోజు 18 గంటల పాటు ప్రజల కోసమే పనిచేస్తున్నామని తెలిపారు.


👉 ఇప్పటివరకు రైతు భరోసా కింద 13,600 కోట్లు జమ చేశాం, నిన్న హైదరాబాదులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ నుంచి రైతాంగానికి 1.49 కోట్లు 39 వేల ఎకరాల రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమచేశామని తెలిపారు. మొత్తం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో జమ చేసిన చరిత్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు.
రైతుల సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 70 వేల కోట్లు ఖర్చు చేస్తుందని,  ఐదు సంవత్సరాల కాలంలో 3.50 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నామని,


👉 ఇది న భూతో న భవిష్యత్తు.. ఇన్ని వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేస్తున్నామని ధైర్యంగా చెప్పడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం అన్నారు.
కేవలం భూమి ఉన్న రైతులకే కాదు భూమిలేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12 వేలు జమ చేస్తున్నామని  తెలిపారు.


👉 రాష్ట్రంలో కోటి కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ పెద్ద ఎత్తున జరుగుతుందని,  సన్న బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 13,525 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.


👉 10 సంవత్సరాలు పరిపాలించిన బిఆర్ఎస్ నేతలు పేదలకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున మొదటి దశలో నాలుగున్నర లక్షల ఇల్లు 22,500 కోట్లతో నిర్మిస్తున్నామని అన్నారు.
అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలోనే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని,  మరో 30 వేలు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ ప్రాసెస్ లో ఉన్నాయని అన్నారు.

👉 ఉద్యోగాలు రాని యువత కోసం ఎనిమిది వేల కోట్లతో ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం తీసుకు వచ్చామని  అన్నారు.  10 సంవత్సరాలు టీఆర్ఎస్ నేతలు డ్వాక్రా సంఘ సభ్యుల గురించి మర్చిపోయారని, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మొదటి సంవత్సరం 21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని,  5 సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘ సభ్యులకు ఇస్తామని అన్నారు. 


👉 పేదలకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు ఎవరి అంచనాలకు అందని రీతిలో  మొదటి దశలో 100 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి 11,500 కోట్లు మంజూరు చేసామన్నారు.


👉 సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల కోసం 40% వైట్ చార్జీలు 200% కాస్మోటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. సంక్షేమం, వ్యవసాయం, ఉపాధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు అని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు దావోస్ లో 1.80 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకొని వచ్చారని తెలిపారు.

వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో తెలంగాణ రాష్ట్రం పోటీ పడుతుందని డిప్యూటీ సీఎం అన్నారు.