👉 మంత్రి లక్ష్మణ్ కుమార్, జడ్పిటిసి , చైర్మన్ , ఎమ్మెల్యే మంత్రి గా !
J.SURENDER KUMAR,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ కు జెడ్పిటిసిలు గా రాజకీయ రంగ ప్రవేశం చేసిన వారిలో కొందరు చైర్మన్ గా, ఎమ్మెల్యేలుగా ఎన్నిక అవుతు మంత్రి పదవులు అలంకరిస్తున్నారు.
👉 వివరాల్లోకి వెళ్తే…
ధర్మారం జడ్పిటిసి గా రాజకీయ రంగ ప్రవేశం చేసిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, జెడ్పి చైర్మన్, 2023 లో ఎమ్మెల్యేగా .. ప్రస్తుతం రాష్ట్రం మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
బిజెపి నాయకుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జడ్పిటిసి గా ఎన్నికై పెద్దపల్లి ఎమ్మెల్యేగా కొనసాగారు. మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య ముందు జెడ్పిటిసి గా ఎన్నికయ్యారు. ప్రస్తుత పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, గతంలో జడ్పిటిసి గా కొనసాగారు.
మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ముందుగా జడ్పిటిసి గా చైర్మన్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, గతంలో జడ్పిటిసిగా ఎన్నికై, కాంగ్రెస్ ఫోర్ లీడర్ గా కొనసాగారు.
మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, గతంలో జెడ్పిటిసిగా కొనసాగారు.
మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా కరీంనగర్ జడ్పీ చైర్మన్ పదవి లో కొనసాగి ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి చేపట్టారు.
మాజీ మంత్రి రాజేశం గౌడ్, ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కొనసాగి కరీంనగర్ జడ్పీ చైర్మన్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం ఎమ్మెల్యేగా కొనసాగి, జెడ్పిటిసి గా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కోసం మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తో పోటీపడ్డారు.
👉 ఇది ఇలా ఉండగా ….
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ గతంలో కరీంనగర్ కార్పొరేటర్ గా కొనసాగారు. కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ గతంలో కార్పొరేటర్ గా రాజకీయ ప్రవేశం చేసిన వారే.