కవయిత్రి ఆఖరి క్షణాల్లో ఆమె ఆశయం నెరవేర్చారు !

J.SURENDER KUMAR,

ఆ కవయిత్రి హంగు, ఆర్భాటాలతో, తన రచనలను ప్రచార మాధ్యమాలలో ప్రచారం చేసుకోలేదు.
ఆ కవయిత్రి ఆఖరి క్షణాల్లో ఆమె ఆశయంను స్థానిక కవులు, కుటుంబ సభ్యులు, అచేతనంగా ఉన్న ఆమె ముందు ఆమె రచించిన  శ్రీ హరిహరామృతం భక్తి గీతాల  పుస్తకాన్ని ధర్మపురి క్షేత్రంలో ఆమె గృహంలో మంగళవారం ఆవిష్కరించి ఆమె ఆశయం నెరవేర్చారు.

వివరాల్లోకి వెళితే..


ధర్మపురి క్షేత్రానికి చెందిన శ్రీమతి బుగ్గారపు
సులోచన (85 ) వయోభారంతో  అనారోగ్య బారిన పడ్డారు. తాను రచించిన శ్రీ హరిహరామృతం భక్తి గీతాల పుస్తకాన్ని ఆవిష్కరించాలి అనేది ఆమె ఆశయం, ఆమె ఆశయం నెరవేర్చడం కోసం ఆమె కుటుంబ సభ్యులు కొడుకులు, కోడళ్ళు ,కూతుళ్లు, అల్లుళ్ళు, మనవలు, ముని మనవాళ్ళతో స్థానిక కవులు పుస్తకాలు ఆవిష్కరించారు. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ కాలక్షేపంగా  భక్తి రస కథనాలు, భక్తి గీతాలు రాయడం ఆమె దిన చర్యలో ఓ భాగం.

ధర్మపురి క్షేత్రానికి  చెందిన కవులు
పెండ్యాల మహేందర్, జన్మించి నర్సయ్య, బుగ్గారపు నరహరి, పెండ్యాల చంద్రశేఖర్, కుటుంబసభ్యులు బుగ్గారపు కిషోర్, శ్రీనివాస్, హరీష్ , అల్లుడు ధ్యామక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సులోచనమ్మ  పాండిత్యాన్ని వారు తమ ప్రసంగాల్లో ప్రశంసించారు.