👉 ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J. SURENDER KUMAR,
డాటర్, డాడీ కి రాసిన ఉత్తరంతో, లీక్ కానీ మరెన్నో ఉత్తరాలతో మీ నాన్న కేసీఆర్ తో పాటు, మీ అన్న కేటీఆర్ నిద్రనే పోతులేరు, అలాంటి వారిపై ఈగ ఎలా వాలుతుందో ? చెల్లె కవితమ్మ అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం లక్ష్మణ్ కుమార్, మీడియా సమావేశంలో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై చెల్లెమ్మ అని సంబోధిస్తూ సెటైర్లు వేశారు.
👉 మీడియా సమావేశంలో పాయింట్స్..
తెలంగాణ జాగృతి కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తన ప్రసంగంలో కెసిఆర్ పై ఈగ వాలనివ్వం అని అన్నారు.
👉 చెల్లె కవితమ్మ నీవు రాసిన డాటర్, డాడీ ఉత్తరం తోనే మీ నాన్న కెసిఆర్, మీ అన్న కేటీఆర్ నిద్రలేకుండా చేస్తున్నావ్, నిద్రపోని వారిపై ఈగలు ఎలా వాలుతాయి చెప్పు చెల్లమ్మ చెల్లమ్మ అన్నారు.
👉 సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడంతో మీ నాన్న కెసిఆర్ సీఎం అయ్యాడు, నీ అన్న, బావ కేటీఆర్, హరీష్ రావు మంత్రులయ్యారు . అన్న హ్యాపీ రావు ( సంతోష రావు) రాజ్యసభకు చెల్లెమ్మ నీవు నిజాంబాద్ ఎంపీగా , ఓడిన ఎమ్మెల్సీ పదవి సంపాదించుకున్నావ్. నీకు ఇందిరమ్మ ,సోనియాగాంధీ కుటుంబాల పేరు ఎత్తే అర్హత లేదు చెల్లెమ్మ అన్నారు.
👉 దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ప్రాణ త్యాగాలు చేశారు, 2004 లో ప్రధాని పదవి అవకాశం వచ్చిన సోనియాగాంధీ వద్దు అని తిరస్కరించారు. 2009 లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే అవకాశం ఉన్న చేయలేదు. త్యాగాల కుటుంబం వారిది, కాలేశ్వరంలో కమిషన్లు, కలెక్షన్ ల కుటుంబం మీది కాదా ? అని ప్రశ్నించారు. నీకు మీ పార్టీకి రాజీవ్ గాంధీ పేరు ఇందిరమ్మ కుటుంబం పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదన్నారు.
👉 కాలేశ్వరం అంశంలో కెసిఆర్ కు విచారణ కమిషన్ నోటీసులు జారీ చేస్తే తెలంగాణ కు నోటీసు ఇచ్చినట్టు మీడియాలో బిల్డప్ డ్రామాలు ఎందుకు ? అని ప్రశ్నించారు.
👉 ఢిల్లీ లిక్కర్ కేసులో ముందు క్లీన్ చీట్ తెచ్చుకో అని హితవు పలికారు.
👉 జాగృతి సంస్థ, భారత జాగృతి సంస్థగా, ప్రకటించావు. నిన్న తెలంగాణ జాగృతి సంస్థ అంటూ కార్యాలయం ప్రారంభించావ్, రేపు ఏ పేరు పైడతావో ప్రకటించు చెల్లె కవితమ్మ అన్నారు.
👉 మీ కుటుంబంలో పదవుల కోసం, ఆస్తి పంపకాల కోసం చేస్తున్న డ్రామాలు, తెలంగాణ సమాజం కు అర్థం కాదని అనుకుంటున్నావా ? అంటూ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కవిత వ్యాఖ్యానాల పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు.