కుల వృత్తుల వస్తు ప్రదర్శన ప్రారంభం !

J SURENDER KUMAR,

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద  హెచ్ఎండిఏ గ్రౌండ్ లో బుధవారం బీసీ కుల వృత్తుల వస్తూ ప్రదర్శనశాల ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ తో పాటు ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు

ఈ సందర్భంగా చేతి వృత్తులు తయారుచేసిన మట్టి కుండలు కప్స్, బాటిల్స్, మ్యాదరి బుట్టలు, చేనేత వస్త్రాలు, పూసల వస్తువులు, రాగి పాత్రలు, ఐరన్, గొడ్డళ్లు, కత్తులు తదితర కాల్స్ ను పరిశీలించి మంత్రులు వివరాలు  అడిగి తెలుసుకొన్నారు.