లబ్ధిదారులకు 1 కోటి 61 లక్షల చెక్కుల పంపిణీ చేసిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR

ధర్మపురి నియోజకవర్గ పరిధి గొల్లపల్లి ఉమ్మడి వెలగటూర్ మండల పరిధిలోని మూడు వందల ముంది లబ్ధిదారులకు మంత్రి లక్ష్మణ్ కుమార్,₹ 1 కోటి 61 లక్షల 29 వేల 500/- విలువ గల చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు.

గొల్లపల్లి, వెలుగుటూరు ( ఎండపల్లి) మండల కేంద్రాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చెక్కుల పంపిణీ జరిగింది.

👉 గొల్లపల్లి మండల  లో46 లక్షల రూపాయలు విలువ గల 46 కళ్యాణ లక్ష్మీ చెక్కులను,34 లక్షల 58 వేల 500 రూపాయల విలువ గల 117 CMRF చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

👉 ఎండపెల్లి మండల కేంద్రంలోని  ఉమ్మడి వెల్గటూర్ మండలానికి  చెందిన ₹ 54 లక్షల రూపాయలు విలువ గల 54 కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను, ₹ 27 లక్షల 29 వేల 500 రూపాయల విలువ గల 92 CMRF చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.