లాఠీలతో ‘లా’ చెప్పడమే కాదు లాలించే తత్వం ధర్మపురి పోలీసులది !

👉 యువకుడి ప్రాణాలు కాపాడిన సీఐ సమయస్ఫూర్తి !

J SURENDER KUMAR,

” పోలీసులంటే ఖాకీ  డ్రెస్సు, కఠిన పరుష

పదజాలాలతో కర్కశంగా లాఠీలతో ‘ లా ‘

చెప్పుతూ సమస్యలు పరిష్కరిస్తారు అని

కొందరిలో ఉన్న భావన సోమవారం చోటు

చేసుకున్న సంఘటనతో తొలగిపోయింది కాబోలు..”

ధర్మపురి పట్టణంలో  ఓ యువకుడి ఆత్మహత్య ప్రయత్నం ను ధర్మపురి పోలీసులు ఆ యువకుడిని లాలించి, బుజ్జగించి, మేము నీకు అండగా ఉంటాం, నీ సమస్య పరిష్కరిస్తాం, నీ పిల్లల మొహం చూడు అంటూ గంటపాటు, బ్రతిమాలి చాకచక్యంగా ఓ యువకుడి ఆత్మహత్యాయత్నాన్ని పోలీసు బృందంతో పాటు రామ్ నర్సింహారెడ్డి చేసిన కౌన్సిలింగ్ సుఖాంతమై  యువకుడు ఆత్మహత్య చేసుకోకుండా సెల్ టవర్ దిగాడు.

👉 వివరాలు ఇలా ఉన్నాయి.

ధర్మపురి పట్టణానికి చెందిన గడిపెళ్లి గోపి @ గోపాల్, (42),  తన భార్యతో  గొడవపడి పోలీస్ స్టేషన్ దగ్గరి  సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య కు ప్రయత్నించాడు.  సమాచారం తెలిసిన సి.ఐ .రాంనర్సింహ రెడ్డి  స్పందించి, హుటాహుటిన పోలీస్ సిబ్బంది తో సెల్ టవర్ వద్దకు చేరుకున్నాడు.

యువకుడుతో గట్టిగా అరుస్తూ , మా పోలీస్ శాఖ నీకు అండగా ఉంటాం, నీ సమస్యను మేము పరిష్కరిస్తాం, నమ్ము ఆత్మహత్య ప్రయత్నం విరమించుకొని కిందకు రా అని పదే పదే యువకుడిని అభ్యర్థించారు.

యువకుడితో సీఐ మాట్లాడుతూనే, ఫైర్ ఇంజన్ కు , అతడి భార్య, కూతురికి సమాచారం ఇచ్చి సంఘటన స్థలానికి రప్పించాడు. ఫైర్ ఇంజన్ లో వున్న వైర్లెస్ మైక్ తో  అతడి కూతురు, భార్యతో  మాట్లాడించారు. కూతురు బాపు కిందికి రా అంటూ కన్నీరు మున్నీరుగా రోధించింది. ముందస్తు జాగ్రత్తగా సెల్ టవర్ కు వలయాకారంగా  పోలీస్ బలగాలను నియమించి అప్రమత్తం చేశారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన హై డ్రామాలో, యువకుడు మీ పై ( పోలీసులపై ) నమ్మకంతో దిగుతున్నానంటూ టవర్ దిగాడు.
వెంటనే యువకుడిని సీఐ తన  వాహనంలో ప్రభుత్య హాస్పిటల్ తరలించారు.

లాఠీలతో  ‘ లా ‘  చెప్పే పోలీస్ యంత్రాంగం లాలించి, బుజ్జగించి రాజీ చేసి కుటుంబం సమస్యను సమరస్యంగా పరిష్కరించి సుఖాంతం చేయడంతో స్థానిక పోలీసుల, సీఐ రామ నర్సింహారెడ్డి సమయస్ఫూర్తిని పట్టణ ప్రజలు ప్రశంసిస్తున్నారు.