మాదిగ జాతి ఆత్మగౌరానికి ప్రతీక మంత్రి పదవి !

👉 ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో…..

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,

J.SURENDER KUMAR,

మన మాదిగ జాతి ఆత్మగౌరానికి ప్రతీక నా మంత్రి పదవి అని అసెంబ్లీలో మన జాతి ఎమ్మెల్యేలు కలిసికట్టుగా కలసికట్టుగా మంత్రివర్గంలో మాకు స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు మహేశ్వర్ కుమార్ గౌడ్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వద్ద అనేకసార్లు చేసిన విజ్ఞప్తి మేరకు నా ఈ మంత్రి పదవి అని
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు.

కరీంనగర్ పట్టణం  అల్గునూర్ లోని ఉన్నతి గార్డెన్స్ లో ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాదిగ అఫీషియల్ ,ప్రొఫెషనల్ సంస్థల ఆధ్వర్యంలో  జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారాయణ, ఎమ్మెల్యే మందుల సామ్యెల్, ప్రాపెసర్ ఖాసిం , మాజీ ఎమ్మెల్యే ఆరేపెల్లి మోహన్  పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముందు హెలెన్ కెల్లార్ 145 జయంతి సందర్భంగా  కరీంనగర్ పట్టణంలోనిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి నివాళులు అర్పించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ….

ఎస్సీ వర్గీకరణ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం  సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదుల నియామకం, మంత్రి దామోదర రాజనర్సింహ, తనతోపాటు మాదిగ ఎమ్మెల్యేలు, సుప్రీంకోర్టు న్యాయవాదులకు వివరించిన అంశాలు, వివక్షత, విద్య ఉద్యోగాలలో మా జాతికి జరుగుతున్న అన్యాయాలు గణాంకాలతో సమిష్టిగా పలుసార్లు వివరించినట్టు మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు.

దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణ  పై ఇచ్చిన తీర్పు మేరకు మన రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ ఆమోదించడం వర్గీకరణ బిల్లు చట్టబద్ధమైన ఆమోదం లభించిన విషయం మంత్రి వివరించారు.
నేటికీ దేశంలో ఏ రాష్ట్రం లో వర్గీకరణ బిల్లు చట్ట సభలలో  ఆమోదం చేయలేదని ఆ ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్భంగా అన్నారు.

ఆత్మీయ సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ను ఎమ్మెల్యేలను ఘనంగా గజమాలతో పలువురు అభినందించారు.

👉 బాధితులను పరామర్శించిన మంత్రి !

కోరుట్ల పట్టణంలో వినాయక విగ్రహ తయారీ కేంద్రంలో ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ఘాతంతో గాయపడి కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరెడ్డి, రాజేష్ లను,  వారి కుటుంబ సభ్యులను మంత్రి లక్ష్మణ్ కుమార్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.



అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.