మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నగదు రహిత వైద్య సేవలు అందించాలి !

👉 మాజీమంత్రి రాజేశం గౌడ్ !

J.SURENDER KUMAR,

మాజీ శాసనసభ్యులు,  శాసనమండలి సభ్యుల ఆరోగ్య భీమాలో అవుట్ పేషెంట్ (ఓపి) చికిత్స బిల్లులను కూడా చేర్చాలి, అలాగే నగదు రహిత చికిత్స (క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్) సౌలభ్యం కల్పించాలని మాజీమంత్రి రాజేశం గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు కలిసి అభ్యర్థించారు.

హైదరాబాద్, సచివాలయంలో సోమవారం రాజేష్ గౌడ్ నాయకత్వంలో , మాజీ మంత్రి రామ్ కిషన్ రావు, మాజీ ఎమ్మెల్యే  సత్యనారాయణ గౌడ్  శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ను కలసి వినతి పత్రం ఇచ్చారు.

సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు  లేజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ నరసింహ, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జ్. చొంగ్తుతో ఈ అంశంపై చర్చించారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో  చర్చించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వారితో అపాయింట్‌మెంట్ కూడా ఇప్పిస్తానని మంత్రి శ్రీధర్ బాబు వారికి హామీ ఇచ్చారు.