👉 టోయింగ్ వాహనం ద్వారా తరలిస్తున్న కారుతో……
J.SURENDER KUMAR,
కోరుట్ల నియోజకవర్గ పర్యటన ముగించుకొని శనివారం రాత్రి ధర్మపురి కు వస్తున్న రాష్ట్ర ఎస్సీ ఎస్టి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. మంత్రి తో పాటు అంగరక్షకులు డ్రైవర్ ఇతరులు సురక్షితంగా బయటపడ్డారు.
👉 వివరాల్లోకి వెళితే
మెట్టుపల్లి నుంచి వస్తున్న మంత్రి కారు కోరుట్ల సమీపంలో అరపేట్ – తులసి నగర్ ప్రాంతంలో కోరుట్ల నుంచి మెట్టుపల్లి వైపు టోయింగ్ వాహనం హోండా సిటీ కారును తగిలించుకొని ఎదురుగా వస్తున్నది.
మంత్రి ప్రయాణిస్తున్న కారుకు సైడ్ ఇచ్చిన టోయింగ్ వాహనం తిరిగి రోడ్డుపైకి రావడంతో టోయింగ్ వాహనంకు వెనక తగిలించుకొని తరలిస్తున్న (హోండా సిటీ కారు) వాహనం మంత్రి కారు ముందరి టైర్ ను బలంగా ఢీకొంది.


దీంతో మంత్రి కారు ( ల్యాండ్ క్యూ జార్ ) టైర్ విరిగిపోయి రోడ్డుపై పడింది. కారు ఒక పక్కకు ఒరిగి పోవడంతో డ్రైవర్ అప్రమత్తమై కారును కంట్రోల్ చేసేసాడు. కాన్వాయ్ లోనీ మరో వాహనంలో మంత్రి ధర్మపురి కి చేరుకొని ఉపాధ్యాయ సంఘ సమావేశంలో పాల్గొన్నారు.