మంత్రి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ ను విడలేదు ధర్మపురిని వదలలేదు !

👉 మంత్రి అడ్లూరి కి ఆచ్చి వచ్చిన ఆదివారం !


J.SURENDER KUMAR,

మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్, లేటుగా గెలిచినా, ఆయన గెలుపు లేటెస్ట్ చర్చగా మారింది. ఇందుకు కారణం మంత్రి లక్ష్మణ్ కుమార్  ధర్మపురి ఎమ్మెల్యేగా విజయం సాధించి గెలుపు ధ్రువీకరణ పత్రం 2023 డిసెంబర్ 3 ఆదివారం, రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది 2025 జూన్ 8 ఆదివారం కావడం కాకతాళియమే అయినా చర్చకు ఆస్కారం ఇస్తున్నది.

2023 డిసెంబర్ 3న ఎమ్మెల్యేగా గెలుపు ధ్రువీకరణ పత్రం తీసుకుంటున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ ( ఫైల్ ఫోటో)


1982 లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ NSUI విద్యార్థి విభాగంలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.
  ప్రజాక్షేత్రంలో విజయం సాధించినా, ప్రతిసారి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ, రాష్ట్రంలో అధికార పార్టీగా ఉండటమే చర్చకు ప్రధాన కారణం. 2023 లో ఎమ్మెల్యేగా గెలిచిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రజా ప్రతినిధిగా గెలిచిన ప్రతిసారి పదవులు ఆయన పంచన చేరుతున్నాయి.

ఇతను ఆల్ ఫ్యాక్టరీ కి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న లక్ష్మణ్ కుమార్ ను అరెస్టు చేస్తున్న పోలీసులు ( ఫైల్ ఫోటో)

👉వివరాల్లోకి వెళితే…

2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ధర్మారం జడ్పిటిసి సభ్యుడి పదవికి పోటీ చేశారు. ఆయన ప్రత్యర్థి మాజీ మంత్రి మాతంగి నరసయ్య, (టిడిపి) ఆయన పై లక్ష్మణ్ కుమార్, దాదాపు 3 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్,  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023  డిసెంబర్ 3న వెల్లడించారు. 

నాడు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకుడు లక్ష్మణ్ కుమార్ ను బలవంతంగా పోలీస్లు నెట్టుతున్న దృశ్యం (ఫైల్ ఫోటో)


ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా , లక్ష్మణ్ కుమార్, ప్రత్యర్థి ఉన్న సిట్టింగ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై 22 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రేవంత్ రెడ్డి సీఎం కావడం తెలిసిన విషయమే విధితమే. నాడు మాజీ మంత్రిని, 2023 లో సిట్టింగ్ మంత్రి ఓడించిన, మంత్రి.లక్ష్మణ్ కుమార్ రాజకీయ చరిత్ర లో రికార్డుగా నమోదయింది.

రాజకీయ కారణాల నేపథ్యంలో నాడు 2010 నుంచి 2012 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా లక్ష్మణ్ కుమార్ కొనసాగారు. చైర్మన్ పదవి కాలం అనంతరం, ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా (క్యాబినెట్ హోదా) 2014 వరకు కొనసాగారు.

👉 కాంగ్రెస్ ను విడలేదు.. ధర్మపురిని వదలలేదు !

ధాన్యం కొనుగోలులో తరుగు తీయ వద్దు అటూ రాస్తారోకో (ఫైల్ ఫోటో)


1982-85 లో (NSUI)కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా, 1986- 94 వరకు NSUI కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా, 194-96 జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా, 1996-2001 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా లక్ష్మణ్ కుమార్ కొనసాగారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 1365 స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంగా ధర్మపురి అసెంబ్లీకి జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రెండుసార్లు పోటీ చేసి. లక్ష్మణ్ కుమార్ ఓటమి చెందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై పోటీ చేసి 441 స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు.

2019 నుంచి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లక్ష్మణ్ కుమార్  కొనసాగుతున్నారు. నాటి బీఆర్ఎస్ పార్టీ కీలక యువనేత కొన్ని సందర్భాల్లో  మంత్రి లక్ష్మణ్ కుమార్ ను తన పార్టీలోకి ఆహ్వానించిన సున్నితంగా తిరస్కరించారు.

👉 పలుసార్లు ఓడిన ధర్మపురి అసెంబ్లీని వీడలేదు !

ప్రతి పక్ష నాయకుడిగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ధర్నాను అడ్డుకుంటున్న పోలీసులు (ఫైల్ ఫోటో)


ధర్మపురి అసెంబ్లీ కి పలుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడినా, లక్ష్మణ్ కుమార్ ధర్మపురి నియోజకవర్గాన్ని వీడిపోలేదు.  అనేక ప్రజా సమస్యలు, రైతాంగ సమస్యలు, విద్యుత్తు రైతుల ధాన్యంలో తరుగు, వెలగటూరు మండలంలో ఇథ్ నల్ పరిశ్రమ ఏర్పాటు వ్యతిరేకిస్తూ ప్రజా పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకో ఆందోళన కార్యక్రమాలలో లక్ష్మణ్ కుమార్ పై టిఆర్ఎస్ ప్రభుత్వం  పోలీసులతో గృహ నిర్బంధాలు, తప్పుడు కేసులు  పెట్టింది.,

అంగన్వాడి కార్యకర్తల ధర్నాలో లక్ష్మణ్ కుమార్ (ఫైల్ ఫోటో)

అర్ధరాత్రి అరెస్టులు, ఇతర ప్రాంతాల పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం. మంత్రి లక్ష్మణ్ కుమార్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తూ బలవంతంగా  వాహనంలో ఎక్కించడం,  ధర్నా లు ఆందోళనలు చేస్తున్న సందర్భంలో లక్ష్మణ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పై  లాఠీ చార్జ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

పోలీసులతో దౌర్జన్యంగా కాంగ్రెస్ శ్రేణుల గృహనిర్బంధాలు (ఫైల్ ఫోటో)

చులకనగా ఎగతాళిగా మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్ కుమార్ ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిన సందర్భాలు ఎన్నో ఎంతగా వేధించిన మంత్రి లక్ష్మణ్ కుమార్  కాంగ్రెస్ శ్రేణులు,ప్రజలతో కలసి ప్రజాక్షేత్రంలో ఆయన రాజీలేని పోరాటాలు చేస్తూ, కాంగ్రెస్ క్యాడర్ ను కాపాడుకున్నారు. 2023 ఎన్నికల్లో లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించి ఆదివారం క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

2023 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు ( ఫైల్ ఫోటో)