👉 ప్రజాక్షేత్రంలో గెలిచిన ప్రతిసారి క్యాబినెట్ హోదా పదవులు !
J.SURENDER KUMAR,
ప్రజాక్షేత్రంలో పోటీ చేసి ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు క్యాబినెట్ హోదా పదవులు వరిస్తున్నాయి.
👉 2023 లో ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై 21692 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విప్ గా కొనసాగుతూ, ఆదివారం క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
👉 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మారం జెడ్పిటిసి సభ్యుడిగా, మాజీ మంత్రి మాతంగి నరసయ్య పై దాదాపు 3000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
👉 తదనంతరం నెలకొన్న రాజకీయ పరిస్థితులలో 2010 నుంచి 2012 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ( క్యాబినెట్ హోదా ) లో కొనసాగారు.
👉 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి ఎమ్మెల్యే అభ్యర్థిగా చేస్తూ ఓటమి చెందారు.
👉 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్ గా కొనసాగుతూ, ఆదివారం క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,
రాజకీయ ప్రొఫైల్ !
👉 పుట్టిన తేదీ: 01- 04- 1968.
👉 జన్మస్థలం: పెద్దపల్లి జిల్లా కేంద్రం !
👉 తండ్రి : స్వర్గీయ అడ్లూరి నాగయ్య !
👉 తల్లి : శ్రీమతి అడ్లూరి లక్ష్మి
👉 కులం : SC (మాదిగ సామాజిక వర్గం)
👉 విద్యార్హత : పెద్దపల్లిలో ఇంటర్మీడియట్ మరియు ఐటీఐ (MM)
👉 1982 to 1985 లో గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి సంఘ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలవడంతోపాటు NSUI ప్యానల్ గెలిపించుకున్నారు.
👉 1986 నుంచి 1994 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా NSUI ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.
👉 1994 నుండి 1996 వరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగారు.
👉 1996 నుండి 2001 వరకు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.
👉 2006 మాజీ మంత్రి మాతంగి నర్సయ్య (3 సార్లు ఎమ్మెల్యే & మాజీ మంత్రి)పై ధర్మారం మండలం (ఎస్సీ రిజర్వ్డ్) 3,000 ఓట్ల మెజార్టీతో జెడ్పిటిసి సభ్యుడిగా గెలుపొందారు.
👉 2009 నియోజకవర్గం పునర్విభజన తర్వాత ధర్మపురి అసెంబ్లీ నుంచి ( ఎస్సీ రిజర్వ్) ఎమ్మెల్యేగా పోటీ చేసి 1,365 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చెందారు.
👉 2010 నుండి 2012 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు.
👉 2013 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఆర్థిక సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు.
👉 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ (పిసిసి) జనరల్ సెక్రటరీగా కొనసాగారు.
👉 2014 స్వరాష్ట్రం తెలంగాణలో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు.
👉 2018 లో జగిత్యాల జిల్లా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు.
👉 2023 లో సిట్టింగ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ఎమ్మెల్యేగా గెలిచారు.
👉 2024 లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ కొనసాగారు.
👉 2025 జూన్ 8 సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.