మంత్రి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం !

J.SURENDER KUMAR,


క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మంగళవారం మొదటిసారి ధర్మపురికి వచ్చిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు కాంగ్రెస్ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు.


పత్తిపాక క్రాస్ రోడ్డు నుండి  మంత్రికి మంగళ వాయిద్యాలు, డప్పుల కోలాటం,  బాణసంచా కాలుస్తూ, వేలాదిమంది ఘనంగా స్వాగతించారు. రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు కాంగ్రెస్ జెండాలు ఏర్పాటుచేసి బెలూన్లను ఎగురవేస్తూ కాంగ్రెస్ శ్రేణులు ముత్యాలు చేస్తూ జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.


మండల కేంద్రమైన ధర్మారం, రాజారాం పల్లె, ఎండపల్లి, వెలగటూర్, గొల్లపల్లి  పెగడపల్లి, ధర్మపురి  మండల పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో కార్లు ఆటోలు ద్విచక్ర వాహనాలతో మంత్రి లక్ష్మణ్ కుమార్ కు  స్వాగతం పలుకుతూ బాణాసంచా కాలుస్తూ నృత్యాలు చేశారు.


అంబేద్కర్  విగ్రహాలకు మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ మంత్రి ర్యాలీలో పాల్గొన్నారు.