మంత్రి లక్ష్మణ్ కుమార్ కు నల్గొండ జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు !


J.SURENDER KUMAR,


ఆదివారం  మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను నల్గొండ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జి.ఓ.ఎం.ఎస్.నెం.133, తేదీ: 12.06.2025 న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాలో ప్రజా పాలన కార్యకలాపాల అమలును సమీక్షించి పర్యవేక్షిస్తారు.

👉 ఇంచార్జ్ మంత్రులు – ఉమ్మడి జిల్లాలు !

👉 మంత్రి దామోదర రాజనరసింహ, మహబూబ్నగర్ జిల్లా !

👉 మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు,  రంగారెడ్డి జిల్లా !

👉 మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  వరంగల్ జిల్లా !

👉 మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ జిల్లా !

👉 మంత్రి డీ.అనసుయ సీతక్క, నిజామాబాద్ జిల్లా !

👉 మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, కరీంనగర్ జిల్లా !

👉 మంత్రి జూపల్లి కృష్ణ రావు, ఆదిలాబాద్ జిల్లా !

👉 మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ జిల్లా !

👉 మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నల్గొండ జిల్లా !

👉 మంత్రి వాకాటి శ్రీహరి,  ఖమ్మం జిల్లా !

👉 ప్రభుత్వం జారీ చేసిన జిఓ..