మంత్రి లక్ష్మణ్ కుమార్ కు నాలుగు శాఖలు !

J.SURENDER KUMAR,


రాజ్ భవన్ లో ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్డూరి లక్ష్మణ్ కుమార్,  వాకాటి శ్రీహరిల కు  మంత్రిత్వ శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 131, తేదీ 11 జూన్ ద్వారా శాఖలు కేటాయిస్తూ   జారీ చేసిన ఉత్తర్వులలో  మంత్రి లక్ష్మణ్ కుమార్ కు నాలుగు శాఖలు కేటాయించారు.

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ , (పోర్ట్‌ఫోలియో)

షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ. గిరిజన సంక్షేమ శాఖ. మైనారిటీల సంక్షేమం.
వికలాంగులు, సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ.

👉 మంత్రి వివేక్ వెంకటస్వామి, (పోర్ట్‌ఫోలియో)

శ్రమ, ఉపాధి, శిక్షణ మరియు కర్మాగారాలు.
గనులు మరియు భూగర్భ శాస్త్రం.

👉 మంత్రి వాకటి శ్రీహరి , ( పోర్ట్‌ఫోలియో)

పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య సంపద.. క్రీడలు మరియు యువజన సేవలుగా ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొనబడింది.