👉 నేడు రాజన్నను దర్శించుకోనున్న మంత్రి !
J.SURENDER KUMAR,
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వాగతం పలికారు.

మంత్రి ఆదివారం వేములవాడ ఆలయానికి విచ్చేయగా, విప్, కలెక్టర్ ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు.

మంత్రి వేములవాడలో ఆదివారం రాత్రి బస చేసి సోమవారం ఉదయం శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఇక్కడ అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, ఇన్చార్జి ఈవో, ఎస్ డి సి రాధాబాయి, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు…