మంత్రి లక్ష్మణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ !

J.SURENDER KUMAR,


తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగల ప్రతినిధిగా మంత్రిపదవీ చేపట్టిన అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ కు  పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ శుభాకాంక్షలు తెలిపారు.


గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో  మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో లేవనెత్తి మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు, అధినేత మందకృష్ణ మాదిగ అనేక సందర్భాల్లో డిమాండ్ చేశారు.

దాని ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగ సామాజిక వర్గం నుండి అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ కు మంత్రివర్గంలో  స్థానం కల్పించారు.


ఈ సందర్భంగా హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో బుధవారం నూతన మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ మాదిగ  కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి  సన్మానించారు.