మంత్రి లక్ష్మణ్ కుమార్ ను కలిసిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు !

J.SURENDER KUMAR,

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా  శాఖ  నాయకులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు.


జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనందరావు యాల్ల అమర్నాథ్ రెడ్డి  మర్యాద పూర్వకంగా కలసి మంత్రికి పూల మొక్క ను అందించి శాలవ తో సన్మానించి అభినందనలు తెలిపారు నాయకులు వేణుగోపాలరావు గణేష్ వంశీ శివ ప్రసాద్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు


👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ కు సన్మానం !


  తపస్  జగిత్యాల జిల్లా శాఖ బుధవారం జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను   జిల్లా శాఖ అధ్యక్షుడు బోనగిరి దేవయ్య , ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ప్రసాదరావు  రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు  అయిల్నేని నరేందర్రావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓద్నాల రాజశేఖర్ ఘనంగా స్వాగతించి సన్మానించారు.


👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగ జేఏసీ !


  రాష్ట్ర మంత్రిగా  ప్రమాణ స్వీకారం చేసిన ధర్మపురి శాసనసభ్యులు  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను  జగిత్యాల జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్  మిర్యాల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో  ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి  పుష్పగుఛ్ఛం  అందించి శాలువాతో సన్మానించి  శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  మాట్లాడుతూ..

ఉద్యోగులకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకు వస్తే తప్పకుండా వాటి పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని, అందరం సమన్వయం తో పని చేసి ప్రభుత్వ పథకాలు విజయవంతం చేద్దామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కో చైర్మన్లు ఎండి. వకీల్, ఆనంద రావు, అమరేందర్ రెడ్డి, అరుణ,  నాయకులు అమర్నాథ్ రెడ్డి, మహమూద్, సాహెద్ బాబు, రవీందర్, మమత, రాజేందర్, రవికుమార్, సుగుణకర్, మధుకర్, భువనేశ్వర్, ప్రమోద్, నారాయణ, వినోద్, గణేష్, రవి, నాగరాజు,  ఉద్యోగులు పాల్గొన్నారు.