J.SURENDER KUMAR,
హైదరాబాద్ లో బంజారాహిల్స్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నివాసంలో సోమవారం ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు.

ఈనెల 8న మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 21న బాధ్యతలు చేపట్టిన మంత్రి లక్ష్మణ్ కుమార్ ను ఉత్తంకుమార్ రెడ్డి అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టు సమస్యలు, రైతులపై భారం పడకుండా ప్రభుత్వ పరంగా ప్రాజెక్టులో పర్యవేక్షణ తదితర అంశాలు చర్చకు వచ్చాయి.
👉 మంత్రి అడ్లూరిని కలిసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎంఐఎం నాయకులు !

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను సోమవారం హైదరాబాద్ సచివాలయంలో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డితో జగిత్యాల ఎంఐఎం అధ్యక్షులు యూనుస్ నదిమ్, మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మైనార్టీల పలు సమస్యలపై చర్చించారు.