మంత్రివర్గంలో మాదిగలకు స్థానం కల్పించాలి మాదిగ ఎమ్మెల్యేలు !

👉 ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను  కలిసిన  విజ్ఞప్తి !

👉 ఇది మాదిగ సామాజిక వర్గ ఆత్మగౌరవ అభ్యర్థన !


J. SURENDER KUMAR,

రాష్ట్రంలో త్వరలో విస్తరించనున్న మంత్రివర్గంలో మాదిగలకు స్థానం కల్పించాలి మాదిగ ఎమ్మెల్యేలు గురువారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ను ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, మందుల సామేల్, కాలే యాదయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు.

👉 ఈ సందర్భంగా నలుగురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ..

మంత్రివర్గంలో తప్పనిసరిగా తమకు స్థానం కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కోరామన్నారు. తమ సామాజిక వర్గం నేతలకు మంత్రివర్గంలో స్థానం పట్ల అధిష్ఠాన పెద్దలు సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.

👉 మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగిన తమ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం ఉంటుందని భావిస్తున్నామని వారు అన్నారు.

👉 ఇది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేల అంశం కాదని.. యావత్ మాదిగ ప్రజలకు సంబంధించిన ఆత్మగౌరవ అంశమని వారు అన్నారు .

👉 తాము ఎవరికీ వ్యతిరేకం కాదని.. మాదిగ సామాజిక వర్గీయులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ రాజకీయంగా కీలక పదవుల్లో ప్రాతినిధ్యం లేదన్నారు.

👉 ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న ఆరుగురు మాదిగ సామాజికవర్గం ఎమ్మెల్యేలలో అధిష్ఠానం ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని వారు తేల్చి చెప్పారు.

👉 తెలంగాణ లో 2011 జనాభా లెక్కల ప్రకారం 32.33 లక్షల మాదిగ జనాభా ఉంది. ప్రస్తుతానికి ఈ సంఖ్య దాదాపు 50 లక్షలకు చేరిందన్నారు.

👉 రాష్ట్రంలో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న మాదిగ జాతికి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు వారు వివరించారు.

👉 తమకు 200%  న్యాయం జరుగుతుందని అధిష్టానంపై నమ్మకం, విశ్వాసం ఉందని ఎమ్మెల్యేలు ఆశాభావం వ్యక్తం చేశారు.

👉 గత 30 సంవత్సరాలుగా మాదిగ జాతి స్వప్నం ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూల తీర్పు వెలువడిన వెంటనే, శాసనసభలో తీర్మానం చేసి, దేశంలో ఏ ఇతర రాష్ట్రం ఇంకా అమలు చేయని ఈ చట్టాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి తెలంగాణ మాదిగ వర్గం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు అని ఎమ్మెల్యేలు అన్నారు.

👉 ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలిచిన శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ వర్గీకరణ కమిటీ కన్వీనర్ శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కో కన్వీనర్  దామోదర రాజనర్సింహా మరియు కమిటీ సభ్యులకు మాదిగ జాతి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మెల్యేలు మీడియా సమావేశంలో అన్నారు.