👉 దివ్యాంగ విద్యార్థికి స్కూటీ !
J.SURENDER KUMAR,
దివ్యాంగ విద్యార్థి జన సమూహాన్ని నెట్టుకుంటూ మంత్రి లక్ష్మణ్ కుమార్ వద్దకు రావడానికి అవస్థలు పడుతున్న దుస్థితిని చూసి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ , తన క్యాబినెట్ హోదా ను, సెక్యూరిటీని పక్కన పెట్టి తానే స్వయంగా దివ్యాంగ విద్యార్థి వద్దకు చేరుకొని అతడితోపాటు మెట్లపై కూర్చుండి, అతడి అభ్యర్థన ఆవేదనను ఆలకించారు.
👉 వివరాలు ఇలా ఉన్నాయి…
ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంగళవారం పెగడపల్లి మండల పర్యటనలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పంపిణీ, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంత్రి హోదాలో లక్ష్మణ్ కుమార్ , మొదటిసారి మండల కేంద్రానికి రావడంతో, భారీ సంఖ్యలో ప్రజలు ఘన స్వాగతం సన్మానం చేస్తూ మంత్రి చుట్టు గుమికూడయారు.
ముద్దులపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగ విద్యార్థి మనోజ్ , వేదిక మెట్ల ఎక్కుతూ మంత్రిని కలవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన మంత్రి లక్ష్మణ్ కుమార్, తానే స్వయంగా దివ్యాంగ విద్యార్థి వద్దకు వచ్చి అతడితో పాటు మెట్లపై కూర్చున్నారు.

ని సమస్య ఏమిటి ? అని విద్యార్థిని అడిగారు. తాను డిగ్రీ చదువుతున్నానని కాలేజీకి వెళ్లడానికి నడవలేక ఇబ్బంది పడుతున్నానని నాకు స్కూటీ కావాలని మంత్రికి విద్యార్థి మనోజ్ మొరపెట్టుకున్నాడు.
స్పందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్, విద్యార్థి సమక్షంలోనే సంబంధిత శాఖ అధికారికి ఫోన్ ద్వారా ముద్దుల పల్లెకు చెందిన మనోజ్ అనే విద్యార్థి కాలేజీకి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నాడని, స్కూటీ వాహనం వెంటనే అతడికి ఇవ్వాలని ఆదేశించారు. ఆ అధికారి ధర్మపురి మంత్రి క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేద్దాం సార్ అన్నాడు.
శనివారం పెగడపల్లి మండలంలోనే మనం విద్యార్థికి స్కూటీని అప్పగించాలని సంబంధిత అధికారిని మంత్రి ఆదేశించారు.
నీకు ఏ సమస్య వచ్చినా నా వద్దకు రావాల్సిన అవసరం లేదు , నాకు ఫోన్ చేయమని నీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భుజం తట్టి దివ్యంగా విద్యార్థి మనోజ్ కు ధైర్యం చెప్పి మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.