👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

హైదరాబాద్ సచివాలయం లో బుధవారం మైనార్టీ వెల్ఫేర్ శాఖ అధికారులు, మరియు చైర్మన్ కమిటీ సభ్యులతో మంత్రి లక్ష్మణ్ కుమార్, పలు అంశాలపై చర్చించి సమీక్షించారు. సమావేశం లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ , తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ చైర్మెన్ మహ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి అధికారులు పాల్గొన్నారు.
