ఎమ్మెల్యేలకు అచ్చి వచ్చిన బుగ్గారం !

👉 నేడు లక్ష్మణ్ కుమార్, నాడు రత్నాకర్ రావు, ఈశ్వర్,  క్యాబినెట్ మంత్రులుగా !


J. SURENDER KUMAR,


2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ  ఓటమి పొందిన, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో  ఎమ్మెల్యేగా పోటీ చేసి  సిట్టింగ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై దాదాపు 22 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన మిమ్మల్ని లక్ష్మణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో  విప్ గా  కొనసాగుతున్నారు , ఆదివారం జరిగిన క్యాబినెట్ విస్తరణలో లక్ష్మణ్ కుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


బుగ్గారం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పలుసార్లు విజయం సాధించిన మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు 2008 లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా కొనసాగారు.


2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన కొప్పుల ఈశ్వర్ 2018 వరకు  ప్రభుత్వ చీఫ్ గా కొనసాగారు. 2018 ఎన్నికల్లో గెలిచిన కొప్పుల ఈశ్వర్ కెసిఆర్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా కొనసాగారు.


👉 బుగ్గారం ప్రత్యేకత !


ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని బుగ్గారం గ్రామం ( అసెంబ్లీలో పునర్విభజనకు ముందు బుగ్గారం అసెంబ్లీ సెగ్మెంట్ ) గా ఉండేది.


2009 పునర్విభజనలో ధర్మపురి అసెంబ్లీ ( ఎస్సీ ) సెగ్మెంట్ గా అవతరించింది. ఈ సెగ్మెంట్ పరిధిలోని పాత అసెంబ్లీ నియోజకవర్గమైన బుగ్గారం ధర్మపురి మండలంలో ఓ గ్రామం గా ఉండేది, ప్రస్తుతం మండల కేంద్రంగా కొనసాగుతున్నది.

నాడు అసెంబ్లీ కేంద్రంగా, నేడు ధర్మపురి అసెంబ్లీ పరిధిలో మండల కేంద్రంగా కొనసాగుతున్న బుగ్గారం, ఎమ్మెల్యేల పాలిట అచ్చి వచ్చిన  రాజకీయ పదోన్నతుల బంగారంగా బుగ్గారం కు గుర్తింపు.