J. SURENDER KUMAR,
వెల్గటూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ & మహాత్మా జ్యోతి భా పూలే పాఠశాలనను రాష్ట్ర ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, సంక్షేమా శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతా కుమారి కాంగ్రెస్ నాయకులతో కలిసి సోమవారం సందర్శించారు.
అనంతరం స్కూలు హాస్టళ్లలో ఉన్న వసతులను పరిశీలించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నాయకులతో కలిసి విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలనీ విద్యార్థులకు సూచించారు.

మోడల్ స్కూల్ పాఠశాలలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని కోరగా మంత్రి దృష్టికి తీసుకెల్లి సత్వరమే మైదానం ఏర్పాటుకు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.