J.SURENDER KUMAR,
కోరుట్ల, జగిత్యాల, మరియు ధర్మపురి నియోజకవర్గలకు (వెల్గటూర్, ధర్మారం, ఎండపల్లి మండలాలు మినహాయించి) పరిధిలోని వున్న గ్రామాలకు మరియు మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ నీరు ఇవ్వలేము అని జగిత్యాల జిల్లా మిషన్ భగీరథ డివిజన్ ఇంజనీర్ జి శేఖర్ రెడ్డి తెలిపారు.
మిషన్ భగీరథ పైపులైను మరమ్మతులు మరియు145 MLD డబ్బా సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా. మూడు రోజులు అనగా 23-06-2025 మధ్యాహ్నం నుండి 25-06-2025 తేదీలలో మున్సిపాలిటీలకు మిషన్ భగీరథ నీరు ఇవ్వలేము అని పేర్కొన్నారు.

మీ గ్రామంలో మరియు మున్సిపాలిటిలో వున్న బోరు లేదా బావి నీరు ఉపయోగించుకోనుటకు తగు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలరని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.