ఆపరేషన్ కగార్ పేరిట సాగిస్తున్న హత్యకాండను  ఆపాలి !

👉 మోడీ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి, మావోయిస్టు పార్టీతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలి !

👉 హైదరాబాద్ ధర్నా చౌక్ లో జరిగిన మహా ధర్నా లో శాంతి చర్చల కమిటీ తీర్మానం !

J.SURENDER KUMAR,

ఆదివాసీలతో సహా, మావోయిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలను భౌతికంగా నిర్మూలించే ఆపరేషన్ కగార్ ను ఆపి, కాల్పుల విరమణను మోడీ ప్రభుత్వం ప్రకటించి, మావోయిస్టు పార్టీతో బేషరతుగా శాంతి చర్చలను వెంటనే ప్రారంభించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్ లో “శాంతి చర్చల కమిటీ” ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా ఏకగ్రీవంగా తీర్మానించింది.


👉 మహాధర్నాలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బిఆర్ఎస్, 12 వామపక్షాలు, యితర రాజకీయ పార్టీలు, పౌర హక్కుల, మానవ హక్కుల సంఘాలు, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, మహిళా, సాంస్కృతిక, ఆదివాసీ, దళిత, తదితర ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.

👉 శాంతి చర్చల కమిటీ ప్రధాన ఉద్దేశం ప్రాణ నష్టం జరగకుండా చూడడం.. ఇరు పక్షాల సాయుధ ఘర్షణలో అనేక సందర్భాలలో అమాయకులు బలౌతున్నారు. ప్రాణం పోతే మళ్ళీ రాదు. ఈ విధంగా ఎవరు చనిపోయినా బాధాకరమే. సాయుధ ఘర్షణలో ఏ ఒక్కరూ చనిపోకుండా చూడాలని, అందుకు శాంతి చర్చలు ఒక్కటే మార్గమనీ, ప్రభుత్వం శాంతి చర్చలకు ముందుకు వస్తే సాయుధ ఘర్షణ నివారించి ప్రాణం నష్టం నివారించవచ్చనీ మేము భావిస్తున్నాము. ప్రభుత్వం మావోయిస్టుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తే, శాశ్వత శాంతి సాధ్యమని నమ్ముతున్నాము.

👉 మహాధర్నాలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బిఆర్ఎస్, 12 వామపక్షాలు, యితర రాజకీయ పార్టీలు, పౌర హక్కుల, మానవ హక్కుల సంఘాలు, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, మహిళా, సాంస్కృతిక, ఆదివాసీ, దళిత, తదితర ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.

👉 మహాధర్నాకు శాంతి చర్చల కమిటీ నాయకులు జస్టిస్ బి.చంద్రకుమార్, ప్రొఫెసర్ జి. హరగోపాల్, కందిమళ్ళ ప్రతాపరెడ్డి అధ్యక్షవర్గంగా వ్యవహరించగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్కుమార్ గౌడ్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే  టి. హరీష్ రావు (బిఆర్ఎస్); తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభాపక్ష నాయకులు కూనంనేని సాంబశివరావు; సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ; సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎం.పి తమ్మినేని వీరభద్రం; సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ కేద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య; సిపిఐ (ఎం-ఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు కే.జి.రామచందర్, ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి; సిపిఐ (ఎం-ఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం. రమేష్ రాజా: ఆర్ఎస్పి రాష్ట్ర కార్యదర్శి జె.జానకిరాములు, సిపిఐ (ఎం-ఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న: ఎసయుసిఐ (సి) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్. మురహరి; ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి బండ సురేందర్రెడ్డి, విసికె నాయకులు జిలకర శ్రీనివాస్ తో పాటు ఆప్ నాయకులు ప్రసంగించారు.

👉 వీరితోపాటు ప్రముఖ పత్రికా సంపాదకులు కె.శ్రీనివాస్, మాజీ ఎమెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, భారత్ బచావో ఆల్ ఇండియా నాయకులు డాక్టర్ ఎం.ఎఫ్. గోపీనాథ్, ప్రముఖ సినీ నటులు ఆర్. నారాయణమూర్తి, సిఎల్సి అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, మానవ హక్కుల వేదిక (హెచ్ఎర్ఎఫ్) నాయకులు ఎస్. జీవన కుమార్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, అరుణోదయ నాయకులు విమలక్క తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య, టిఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ ఏ. వినాయకరెడ్డి, ఐఎన్పీఎం అధ్యక్షులు డాక్టర్ ఎం. కృష్ణప్రసాద్, ప్రొఫెసర్ పద్మజా షో, కె. విశ్వనాథ్ తదితరులు కూడా మాట్లాడారు.