పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 హైదరాబాదు లోని తన అధికారిక నివాసంలో మొక్క నాటిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ప్రస్తుతం కాంక్రీట్ మయమైన సమాజంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించి సమాజానికి స్వచ్ఛమైన ప్రాణవాయు అందించాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,  తన అధికారిక నివాసం హైదరాబాదులో గురువారం  మొక్కలు నాటారు.
ఇటీవలే మరణించిన పద్మశ్రీ వనజీవి రామయ్య  స్ఫూర్తి గా  వాశ్విక్ ఫౌండేషన్ చైర్మన్ , నిడిగొండ నరేష్ ప్రజాపతి  ఒక సంవత్సరంలో లక్ష మొక్కలు నాటాలనే నిర్ణయం తీసుకున్నారు.


లక్ష మొక్కల కార్యక్రమంలో భాగంగా మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , అధికారిక నివాసంలో మొదటి మొక్కను నాటించి తన కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..


మంత్రి  తన స్వంత ఉమ్మడి కరీంనగర్ జిల్లా తో  పాటు తన నియోజక వర్గమైన ధర్మపురి నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలని నరేష్ ప్రజాపతి ని కోరారు
బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వాటర్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, గాయకులు మిట్టపల్లి సురేందర్, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త జిఆర్కే రెడ్డి , గాజుల రవికుమార్ ఎడ్యుజోన్ సీఈఓ లు పాల్గొన్నారు