పేదల సొంత ఇంటి కల మా ప్రభుత్వం నెరవేరుస్తుంది !

👉 389 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ !

👉 లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం ప్రారంభించాలి !


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


పేదల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
గొల్లపెల్లి మండల కేంద్రంలో బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి 389 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.


👉 ఈ  సందర్బంగా మంత్రి  లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు సత్వరమే నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


అత్యంత పేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. విడతల వారీగా ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తుందని వెల్లడించారు. సిమెంట్, స్టీల్ ధరలు తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నదని వివరించారు.

👉 జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ మాట్లాడుతూ..

ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టాలని సూచించారు. బేస్మెంట్, ఇతర దశలు పూర్తి కాగానే గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డ్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాలని, వారు ఆన్లైన్లో నిర్మాణ దశను తెలియజేసి ప్రభుత్వం నుండి సొమ్ము త్వరగా అందేలా చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రతి సోమవారం సొమ్ము చెల్లిస్తుందని, ఎవరి పైరవీలూ అవసరం లేదని స్పష్టం చేశారు. 
ఈ కార్యక్రమంలో  రెవిన్యూ డివిజనల్ అధికారి  మధుసూదన్, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్  ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.