👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశ పెట్టి దాన్ని అమలు చేస్తున్నదని, ప్రభుత్వం తరపున మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ లో రైతువేదికలో ప్రభుత్వం తరపున 375 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రాలను మంగళవారం జరిగిన పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆర్డీవో తో కలిసి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను అందించారు.

👉 అనంతరం 18 లక్షల రూపాయలు విలువ గల 18 కళ్యాణ లక్ష్మీ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణి చేశారు.
కార్యక్రమానికి ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.

నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందని, ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఆరువందల స్క్వేర్ ఫీట్స్లో ఇంటి నిర్మాణం చేపట్టాలని దానికి అనుగుణంగా నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, మంత్రి అన్నారు.
👉 పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందన్నారు.

👉, రైతు భరోసా కింద 13712 మంది రైతులకు ₹ 13 కోట్ల 57 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందనీ,రైతు భీమా కింద 45 మందికి 5 లక్షల రూపాయల చొప్పున ₹ 2 కోట్ల 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని, రుణమఫీ కింద లక్ష మరియు ₹ 2 లక్షల రూపాయలు లోపు మొత్తంగా 5611 మంది రైతులకు ₹ 43 కోట్ల 03 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసామని మంత్రి అన్నారు.
👉 ఇందిరమ్మ ఇళ్లు ఇంకా ఎవరైనా అర్హత ఉండి ఇల్లు రాని వారు ఉంటే నన్ను నేరుగా సంప్రదించవచ్చని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.