👉 అమ్మ మాట – అంగన్ వాడి బాట కార్యక్రమములో –
👉 జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ !
J.SURENDER KUMAR,
అంగన్వాడీ కేంద్రంలో పోషణతో కూడిన విద్యను అందించడమే ప్రధాన లక్ష్యమని మరియు ఈ అంగన్వాడి కేంద్రంలో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల యొక్క నమోదులు పెంచడం మరియు పిల్లల యొక్క ప్రీస్కూల్ హాజరును పెంచడమే అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.
జగిత్యాల జిల్లా “మహిళా అబివృద్ది, శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో బుధవారంఅమ్మ మాట – అంగన్ వాడి బాట కార్యక్రమన్ని ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామములో జరిగినది .
ఈ సందర్బంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ…

అంగన్వాడీ కేంద్రంలో ప్రవైట్ బడులకు ధీటుగా పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం కోసం ప్రత్యేకమైన సిలబసును రూపొందించి ఆటపాటలతో కూడుకున్న విద్యను పిల్లలకు అందజేసి పిల్లల్లో సృజనాత్మకను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు.
మరియు అంగన్వాడి కేంద్రంలోని పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యూనిఫాములు మరియు ఆట వస్తువులు, ఫర్నిచరు, మ్యాట్లు , ప్రియదర్శిని పుస్తకాలు పిల్లల కోసం అందజేయడం జరుగుతుందని అన్నారు
అలాగే అంగన్ వాడి కేంద్రాలకు సొంత భవనాలతో పాటు మౌలిక సదుపాయాలు – త్రాగు నీరు, మరుగుదొడ్లు, విద్యుత్ కూడా అందిచాడనికి ప్రభుత్వం ప్రత్యక శ్రద్ధ చూపడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ విధంగా పిల్లలకు అమ్మ ఒడి తరువాత ,అంగన్ వాడి బడి తర్వాతి ఒడిగా ఉంటుందని అన్నారు.
ఇలాంటి మెరుగైన సేవలను అంగన్వాడీ కేంద్రం ద్వారా అందజేయడం జరుగుతుందని అందుకని ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమకు దగ్గరగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలను చేర్పించి అంగడి వాడి సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ అందరిని కోరారు. అనంతరం అంగన్ వాడి కేంద్రములో ఏర్పరిచిన బడి గంటను జిల్లా కలెక్టర్ ప్రారంభీంచి గంట కొట్టారు .

ఈ కార్యక్రమంలో జగిత్యాల RDO మధు సుధన్ , జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బోనగిరి నరేష్ ,మరియు సిడిపిఓ వాణిశ్రీ, సూపర్వైజర్లు పవిత్ర, లత మరియు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తల్లిదండ్రులు పిల్లలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.