👉 83 లక్షల 9 వేల 962 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ..
👉 మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.!
J . SURRENDER KUMAR,
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాల ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు.
శుక్రవారం రామాయంపేట పట్టణంలోని మెహర్ సాయి ఫంక్షన్ హాల్ నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు.. అందరి సహకారంతో మెదక్ నియోజకవర్గం ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
రామాయంపేట మండలంలో 83 మంది లబ్ధిదారులకు ₹ 83 లక్షల 9 వేల 962 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రజిని కుమారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహమ్మద్ గౌస్, గోపి, సిబ్బంది రోజా, సునీత, చంద్రకళ, కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సుప్రభాత రావు, రమేష్ రెడ్డి, సరపు యాదగిరి, గజవాడ నాగరాజు, డీ ఈ యం ఈ యాదగిరి, చింతల స్వామి, తోపాటు వివిధ గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.