👉 విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం, సమాన అవకాశాలు చేకూర్చే విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందని, ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లె గ్రామంలో. మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి

👉 అనంతరం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవంలో నన్ను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని,
భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి ‘ భారతరత్న ‘ అవార్డును ఇవ్వడం జరిగిందనీ, తెలంగాణ ఏర్పాటు కలను సాధ్యం చేసింది అంబేడ్కర్ రాజ్యాంగం అని ఎమ్మెల్యే అన్నారు.

ముందుచూపుతో ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.